ఆగస్టులో శ్రీవారి పుష్కరిణి మూసివేత

కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో పుష్కరిణిని మూసివేయనున్నట్లు టీటీడీ(TTD) తెలిపింది. ఆగస్టు ఒకటి నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు తిరుమల కొండపై పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇందులో భాగంగానే తిరుమలలోని పుష్కరిణి హారతి ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు దీనిని గమనించాలని టీటీడీ అధికారులు సూచించారు.

ఆగస్టులో శ్రీవారి పుష్కరిణి మూసివేత
New Update

Srivari Pushkarini to be closed in Tirumala

కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో పుష్కరిణిని మూసివేయనున్నట్లు టీటీడీ(TTD) తెలిపింది. ఆగస్టు ఒకటి నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు తిరుమల కొండపై పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇందులో భాగంగానే తిరుమలలోని పుష్కరిణి హారతి ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు దీనిని గమనించాలని టీటీడీ అధికారులు సూచించారు.

సాధారణంగా తిరుమల కొండపై స్వామి వారి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. దీంతో అందుబాటులో ఉన్న అత్యుత్తమ రీ సైక్లింగ్ (Re cycling) ద్వారా మరమ్మతులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. టీటీడీ నిరంతరాయంగా కొంత శాతం నీటిని రీ సైక్లింగ్‌ ద్వారా శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తూ వస్తోంది. అనంతరం అధికారులు మరికొంత శాతం నీటిని శుద్ధి చేస్తారు. ఇలా నిరంతరాయంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు (brahmotsavams) ఉండటంతో నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులు ఉంటే పూర్తి చేయనున్నట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.

మరమ్మతులో భాగంగా మొదటి 10 రోజులు నీటిని తొలగించనున్న అధికారులు.. ఆ తర్వాత 10 రోజులు మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. అనంతరం చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి దానిని పూర్తిగా సిద్ధం చేయనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. తిరుమల తిరుపతి బోర్డు వాటర్‌ బోర్డు వర్స్క్‌ (Water Board Works) విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టబోతున్నట్లు టీటీడీ (TTD) పేర్కొంది.

కాగా ఇటీవల తిరుమల-తిరుమతి మధ్య ఉన్న ఘాట్‌ రోడ్డులో (ghat Road) రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వాహనాలు పైకి వెళ్లే సమయంలోనూ, కొండపై నుంచి క్రిందకు దిగే సమయంలోనూ రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. దీంతో పలువురు భక్తులు గాయపడ్డారు. దీనిపై స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) రోడ్డు ప్రమాదాలు జరుగకుండా వాహనాల స్పీడ్‌ లిమిట్‌ను తగ్గించినట్లు, మొదటి ఘాట్‌ రోడ్డులో యాగం నిర్వహించినట్లు తెలిపారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. దీంతో కొందరు భక్తులు తిరుమల ప్రయాణం వాయిదా వేసుకుంటుండగా.. మరికొందరు వేర్వేరు కారణాలతో కొండపైకి రాలేకపోతున్నారు. మంగళవారం (జూలై 25) తిరుమల శ్రీవారిని 73,137 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 27 వేల 490 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. మరోవైపు మంగళవారం (Tuesday) శ్రీవారికి 4.06 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు వివరించారు. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శనం త్వరగా పూర్తి కావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

#ttd #august #pushkarani #closure #repair
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe