Tirumala News: జూన్ 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసింది. జూన్ 19 నుంచి 21 వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహించనుంది. మూడు రోజుల పాటు ఘనంగా జ్యేష్ఠాభిషేకం జరగనుంది.
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ..
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 69,870 మంది భక్తులు దర్శించుకున్నారని.. 42,119 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు పేర్కొంది. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.