Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జులై 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. జులై 22న వర్చువల్ సేవల కోటా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. జులై 23న అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేయనుంది.
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులుకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీపీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 84,797 మంది భక్తులు దర్శించుకున్నారని... 29,497 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తెలిపింది. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.