AP Chirutha: నిన్న తిరుమల..ఇవాళ శ్రీశైలం.. హడలెత్తిస్తున్న చిరుతలు

ఏపీలో చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. శ్రీశైలం వీరశైవ గురుకులం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. గట్టిగా కేకలు వేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత వీడియోలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు భక్తులు. అటు చిరుత సంచారంతో గురుకులం విద్యార్థులు భయం గుప్పిట్లో బతుకున్నారు. అటు తిరుపతిని చిరుత భయాలు వీడడం లేదు. తిరుపతిలో మరోసారి చిరుతపులి కనిపించడం అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింద. యస్వీ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చిరుత ప్రత్యక్షమైంది.

AP Chirutha: నిన్న తిరుమల..ఇవాళ శ్రీశైలం.. హడలెత్తిస్తున్న చిరుతలు
New Update

ఏపీలో చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. శ్రీశైలం వీరశైవ గురుకులం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది.

గట్టిగా కేకలు వేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత వీడియోలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు భక్తులు. అటు చిరుత సంచారంతో గురుకులం విద్యార్థులు భయం గుప్పిట్లో బతుకున్నారు.

అటు తిరుపతిని చిరుత భయాలు వీడడం లేదు. తిరుపతిలో మరోసారి చిరుతపులి కనిపించడం అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింద. యస్వీ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చిరుత ప్రత్యక్షమైంది. నిన్న(ఆగస్టు 14) సాయంత్రం విద్యార్థులకు చిరుతపులి కనిపించింది. కాలేజ్‌కు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో మకాం వేసింది. అది చూసిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అటవీ శాఖ సిబ్బందికి వర్సిటీ సెక్యూరిటీ సమాచారం ఇచ్చింది. వరుసగా చిరుతపులులు కనిపిస్తుండడం ఏపీ వాసులను భయపెడుతోంది. తిరుమల నడకదారిలో ఇప్పటికే రెండు చిరుతుల కనిపించగా.. అందులో ఓ ఓ చిరుతను ఇప్పటికే అటవీశాఖ సిబ్బంది బంధించారు. కొన్ని రోజుల క్రితం లక్షిత అనే ఆరేళ్ల బాలికను చిరుత చంపేసింది.

(This is an updating story)

#tirupati #ap-chiruthas #tirupati-modi-incident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe