AP: శ్రీకాకుళం జవాన్‌ రాజేష్‌ వీరమరణం.. మూడు నెలల్లో వచ్చి పెళ్ళి చేసుకుంటానని..

జమ్మూకశ్మీర్‌ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జవాన్‌ రాజేష్‌ వీరమరణం పొందారు. ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పుల్లో బుల్లెట్ తగలడంతో ఆయన మృతి చెందారు. ఆరేళ్లుగా రాజేష్‌ సైన్యంలో పనిచేస్తున్నాడు. సైన్యానికి చెందిన కెప్టెన్‌ సహా నలుగురు సైనికులు అమరులయ్యారు.

New Update
AP: శ్రీకాకుళం జవాన్‌ రాజేష్‌ వీరమరణం.. మూడు నెలల్లో వచ్చి పెళ్ళి చేసుకుంటానని..

Also Read: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటన

మూడు రోజులుగా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ప్రస్తుతం నాయక్‌ హోదాలో పనిచేస్తున్న రాజేష్‌.. ఎదురుకాల్పుల్లో మెడకు బుల్లెట్ తగలడంతో మృతి చెందారు. ఇవాళ రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు రాజేష్‌ భాతికకాయం చేరుకోనుంది. మూడు నెలల్లో వచ్చి ఇల్లు కట్టుకుని పెళ్ళి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పిన రాజేష్ ఇప్పుడు విగతా జీవిగా వస్తుండడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: మిస్టరీగా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు..!

జమ్మూకశ్మీర్‌లోని డోడా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య మంగళవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. సైన్యానికి చెందిన కెప్టెన్‌ సహా నలుగురు సైనికులు అమరులయ్యారు. మరోజవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Advertisment
తాజా కథనాలు