Rama Navami Special Songs : మన చిన్న తనం నుంచి శ్రీరామ నవమి వేడుకలను(Sri Rama Navami Celebrations) ఊరు వాడా ఎంతో ఘనంగా నిర్వహించడం మనందరికీ తెలిసిందే. ఉదయం నుంచే రాముల వారి గుడి దగ్గర మైకులో సూపర్ హిట్ అయిన రాముల వారి పాటలను(Lord Rama Songs) వేసే వారు. ఇప్పటికీ పెళ్లి జరుగుతుంది అంటే కచ్చితంగా రాముల వారి కల్యాణానికి సంబంధించిన పాట ఉంటుంది.
అసలు శ్రీరామ నవమి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ఐదు పాటలు ఉన్నాయి. వాటిలో ముందుగా అందరి మదిలో మెదిలే సాంగ్ శ్రీ సీతారాముల కల్యాణం(Wedding of Sita Rama) చూతము రారండి... ఎంతో కాలం నుంచి ఈ పాటను కచ్చితంగా పెళ్లిళ్లలో, పెళ్లి వీడియోలో పెడుతుంటారు.
సీతారాముల కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి
బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి
నామము తీర్చి
చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంపగవాకి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలిసిన రాముని
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
ఆ తరువాత దేవుళ్లు సినిమాలోని అందరి బంధువయ్యా సాంగ్... ఈ పాట కూడా ఎంతో హాయిగా సాగుతుంది. భద్రాచలం(Bhadrachalam) పరిసర ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ సినిమాలో ఇద్దరు చిన్నారులకు రాముల విశిష్టతను స్వయంగా హనుమంతుల వారే వివరించడం ఎంతో బాగుటుంది.
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..
తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా
మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ
అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ...
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య
కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం
పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ
సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ..ఆ...
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
ఆ తరువాత శ్రీ రామ రాజ్యం(Sri Rama Rajyam) సినిమాలోని జగదానంద కారక.. జయ జానకీ ప్రాణ నాయక..శుభ స్వాగతం...ప్రియ పరిపాలక అంటూ రాముల వారి పరిపాలనను కీర్తీస్తూ సాగే ఈ సాంగ్ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా (2)
శుభస్వాగతం ప్రియ పరిపాలకా !!
జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా
శుభస్వాగతం ప్రియ పరిపాలకా !!
మంగళకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక ఔగాక
మా జీవనమే ఇక పావనమౌగాక !!
నీ.. పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా (2)
శుభస్వాగతం ప్రియ పరిపాలకా !!
*సార్వభౌమునిగ పూర్ణకుంభముల స్వాగతాలు పలికే..
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే..
నాల్గు వేదములు తన్మయత్వమున చెలగి మారుమ్రోగే
న్యాయదేవతే శంఖమూదగా పూలవాన కురిసే
రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసె అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాదస్పర్శకి పరవశించిపోయే
జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా
శుభస్వాగతం ప్రియ పరిపాలకా !! (2)
*రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే
రామశాసనము తిరుగులేనిదని జలధి బోధచేసే
రామదర్శనము జన్మధన్యమని రాయికూడా తెలిపే
రామరాజ్యమే పౌరులందరిని నీతిబాట నిలిపే
రామమంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం
ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే
||జగదానంద కారకా||
ఆ తరువాత శ్రీరామ దాసు సినిమాలోని అంతా రామమాయం సాంగ్.. ఈ పాటలో విశ్వమంతా రాముడు వ్యాపించి ఉన్నాడు అని చెబుతూ ఓ భక్తుడు పరవవించి పులకించి పాడే పాట.
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
అంతరంగమున ఆత్మారాముడు
అనంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానా మృగములు
విహిత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ఆ.... ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు
ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత
శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై.
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
Also Read : మా రామయ్య పెళ్లికొడుకాయనే..!
శ్రీరామదాసు(Sri Ramadas) సినిమాలోని భద్రశైల రాజమందిర పాట కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే!
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః!
భద్రశైల రాజమందిరా.శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా!
భద్రశైల రాజమందిరా.శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా!
వేద వినుత రాజమండలా . శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా!
వేద వినుత రాజమండలా . శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా!
సతత రామ దాస పోషకా.శ్రీ రామచంద్ర వితత భద్రగిరి నివేశకా!
భద్రశైల రాజమందిరా.శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా!
బాహు మధ్య విలసితేంద్రియా.
బాహు మధ్య విలసితేంద్రియా.
కోదండరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ!
కోదందరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ!
తల్లివి నీవే.తండ్రివి నీవే.దాతవు నీవే.దైవము నీవే!
కోదండరామా కోదండరామా రామ రామ కోందండరామ!
దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా!
దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా!
దశరధ రామా గోవిందా!
దశముఖ సం హార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖ చక్రధరా!
దశరధ రామా గోవిందా!
తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ!
తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ!
ఒక్క తోడుగా భగవంతుండు మును చక్రధారియై చెంతనె ఉండగ
తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ!
తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ!
జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా
జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా
పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో
పాహి రామప్రభో!
శ్రీమన్మహాగుణ స్తోమాభి రామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామప్రభో!
సుందరాకార మన్మందిరాద్ధార సీతేందిరా సం యుతానంద రామప్రభో!
పాహి రామప్రభో!
పాహి రామప్రభో!
పాహి రామప్రభో!