Sri Lanka: నిఘా నౌకలపై నిషేధం ఎత్తివేయనున్న..శ్రీలంక!

శ్రీలంకలో విదేశీ పరిశోధక నౌకలపై తమ దేశం విధించిన మారటోరియం వచ్చే జనవరి వరకు మాత్రమే అమలవుతుందని ఆదేశ  విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ప్రకటించారు.గతంలో కేంద్ర విదేశాంగ శాఖ.. భారత్ పై గూఢాచార్యం చేసేందుకే శ్రీలంకలో చైనా పరిశోధన నౌకలు నిలపుదల చేశాయని ఆరోపించింది.

New Update
Sri Lanka: నిఘా నౌకలపై నిషేధం ఎత్తివేయనున్న..శ్రీలంక!

Research Ships: మన పొరుగు రాష్ట్రం శ్రీలంక ఓడరేవులో గత కొన్నేళ్లుగా చైనా పరిశోధనా నౌకలు నిలిచిపోయాయి.గతంలో ఈ నౌకలకు పరిశోధన  పనులకు శ్రీలంక (Sri Lanka) అనుమతులు ఇచ్చింది. ఆ సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్ పై గూఢాచర్యం చేసేందుకే ఈ నౌకలను నిలిపివేస్తున్నారని శ్రీలంకపై ఆరోపించారు.

అయితే శ్రీలంక తన ఓడరేవులలో మారటోరియం చేసే విదేశీ నౌకలపై నిషేధం విదిస్తున్నట్లు గతంలో ప్రకటించింది. కానీ అది ప్రకటించిన నెలరోజుల ముందే శ్రీలంక నౌకాశ్రయానికి చైనా మరో పరిశోధన నౌకకు శ్రీలంక అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో జపాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వచ్చే ఏడాది జనవరి వరకే విదేశీ నౌకల  మారిటోరియం నిషేధం అమలవుతుందని..ఆ తర్వాత ఆ నిషేధాన్నితొలగించనున్నట్లు అక్కడి మీడియాకు తెలిపారు.

Also Read: ముగిసిన నీట్‌ విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు