T20 World Cup 2024: నెదర్లాండ్స్ పై భారీ విజయం సాధించిన శ్రీలంక! టీ20 వరల్డ్ కప్‌లో సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో శ్రీలంక 83 పరుగుల రికార్డు విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లకి 6 వికెట్లు కోల్పొయి 201 పరుగులు చేసింది.ఛేజింగ్ ప్రారంభించిన నెదర్లాండ్ 118 పరుగులకే ఆలౌటైంది. By Durga Rao 17 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Sri Lanka vs Netherlands: నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో 200+ స్కోరు నమోదవ్వడం ఇదే రెండో సారి. ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 201 పరుగులే చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్ నిశాంక డకౌట్ తో వెనుతిరిగాడు. కామిందు మెండిస్ (17; 20 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డిసిల్వా (34; 26 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి కుశాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు దూకుడుగా ఆడారు. కుశాల్, డిసిల్వా ఔటైన తర్వాత బాదే బాధ్యతను అసలంక, మాథ్యూస్ (30 నాటౌట్; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) అందుకున్నారు. Sri Lanka sign off the #T20WorldCup with a comfortable win over Netherlands 👏#SLvNED: https://t.co/8emxMgGCqW pic.twitter.com/UblMPk95oW — T20 World Cup (@T20WorldCup) June 17, 2024 ఆఖర్లో హసరంగ 6 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్ల తో విరుచుకుపడంతో చివరి అయిదు ఓవర్లలో 77 పరుగులను లంక సాధించింది. అనంతరం భారీ ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 16.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. మైకేల్ (31; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), స్కాట్ ఎడ్వర్ట్స్ (31; 24 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్లు. నువాన్ తుషారా మూడు, హసరంగ, పతిరనా చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ఛేజింగ్‌లో నెదర్లాండ్స్ శుభారంభం దక్కింది.ఓపెనర్లు 5.3 ఓవర్లలో 45 పరుగులు సాధించారు. కానీ ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయి డచ్ ఓటమిపాలైంది. Also Read: టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే.. #sri-lanka #netherlands మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి