భారత్ తో జరిగే టీ20 సిరీస్ కు జట్టును ప్రకటించిన శ్రీలంక!

జూలై 27 నుంచి భారత్,శ్రీలంక ల మధ్య ప్రారంభంకానున్న టీ20 సిరీస్ కు శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన చేసి నిష్క్రమించినందుకు హసరంగ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ పదవిని శ్రీలంక బోర్డ్ అసలంకకు అప్పగించింది.

New Update
భారత్ తో జరిగే టీ20 సిరీస్ కు జట్టును ప్రకటించిన శ్రీలంక!

భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ఆతిథ్య శ్రీలంక జట్టును ప్రకటించింది. జూలై 27 నుంచి ప్రారంభం కానున్న సిరీస్ కోసం ఈ రోజు16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. టీమ్ కమాండ్ చరిత్ అసలంక చేతిలో ఉంటుంది. శ్రీలంక పర్యటన కోసం భారత జట్టు సోమవారం (జులై 22) కొలంబో చేరుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడంతో శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగ తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఆ బాధ్యతలను అసలంకకు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

కొత్త కెప్టెన్‌తో శ్రీలంక జట్టు భారత్‌తో ఆడనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ సిరీస్‌లో అతను ఆటగాడిగా జట్టులో భాగం కానున్నాడు. భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు అప్పగించారు.

శ్రీలంక టీ20 జట్టు 

చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, వనిందు హసరంగా, కుసాల్ మెండిస్, దినేష్ చండిమల్, కమిందు మెండిస్, దునిత్ వెల్లాలఘే, దాసున్ షనక, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతిషా చతురమే, డి నుష్ పతిరమే, డి నుష్ పతిరాన, ఫెర్నాండో

భారత T-20 జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు మహ్మద్ సిరాజ్.

Advertisment
తాజా కథనాలు