Ghee Halwa: కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం.. రవ్వతో నేతి హల్వా ఇలా చేయండి!

కృష్ణాష్టమి సమయంలో కన్నయ్యకు ఇష్టమైన ప్రసాదాలలో ఒకటి నేతి హల్వా. దీనిని ప్రసాదంగా పెడితే కృష్ణుడి అనుగ్రహం పొందొచ్చని చెబుతుంటారు. దీనిని చాలా సింపుల్‌​గా, టేస్టీగా చేసేయొచ్చు. హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, రెసిపీ ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

New Update
Ghee Halwa: కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం.. రవ్వతో నేతి హల్వా ఇలా చేయండి!

Krishnashtami 2024:  కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఎంతో ఇష్టమైన నేయితో అనేక రకాల వంటలు చేసి పెడతారు. అలాంటి వాటిలో నేతితో చేసే హల్వా ఒకటి. ఏ పండుగకు ఏ ప్రసాదం చేసినా భక్తితో దేవుడికి పెడితే అనుగ్రహం పొందవచ్చు. దీనిని చాలా సింపుల్‌​గా, టేస్టీగా చేసేయొచ్చు. ఈ నేతి హల్వాను ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

నెయ్యి- ముప్పావు కప్పు, బాదం - 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష - 1 టేబుల్ స్పూన్, రవ్వ - 1 కప్పు, శెనగపిండి - 2 టేబుల్ స్పూన్స్, పాలు - 1 కప్పు, నీళ్లు - 2 కప్పులు, కుంకుమ పువ్వు - 2 టేబుల్ స్పూన్స్, పంచదార - ముప్పావు కప్పు, యాలకుల పొడి - చిటికెడు, నెయ్యి - పావు కప్పు

తయారీ విధానం:

  • ముందుగా పోయ్యి మీద కడాయిలో నెయ్యి వేసి బాదం పలుకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకోవాలి. మంటను సిమ్‌లో ఉంచి డ్రై ఫ్రూట్స్‌ రోస్ట్ చేయాలి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుంకుమపువ్వు నానబెట్టుకోవాలి. అనంతరం అదే కడాయిలో కప్పు రవ్వ, శనగపిండి వేసి వీటిని బాగా కలుపుతూ చిన్నమంట మీద వేయించుకోవాలి. నెయ్యి, రవ్వ, పిండి పూర్తిగా కలిసే వరకు మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి.
  • ఈ మిశ్రమం రంగు మారి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకుంటూ ఉండాలి. ఈలోపు మరోస్టౌవ్ వెలిగించి దానిలో ఓ కప్పు పాలు, రెండు కప్పుల నీరు, నానబెట్టుకున్న కుంకుమ పువ్వును ఈ పాలల్లో వేసి బాగా కలపాలి. పాలల్లో కుంకుమపువ్వు కలిశాక.. పాలను మరగనివ్వాలి. పాలు మరిగేసరికి రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి సువాసన వస్తుంది. ఈ సమయంలో మరిగించిన పాలను ఈ రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి.
  • ఉండలు లేకుండా మిశ్రమాన్ని కలుపుకోవాలి. అప్పుడు పాలు రవ్వను పూర్తిగా పీల్చుకుంటాయి. బాగా కలిపిన తర్వాత దానిపై మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. రవ్వ కాస్త మెత్తగా మారుతుంది. ఇప్పుడు దానిలో పంచదార వేసి కరిగి రవ్వలో కలిసిపోయేవరకు కలుపుతూనే ఉండాలి. పంచదార పూర్తిగా కరిగి.. రవ్వకు పట్టుకున్న తర్వాత.. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. చివర్‌లో చిటికెడు యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
  • మరో పావు కప్పు నెయ్యి చివరలో వేయాలి. ఇలా చేయడం వల్ల హల్వ పొడిగా కాకుండా మెత్తగా, టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ ప్రసాదాన్ని కృష్ణాష్టమి రోజు చేసి కన్నయ్యకు నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు. ఈ నేతి హల్వా అందరూ ఇష్టంగా తింటారు. ఈ జన్మాష్టమికి ఆలస్యం చేయకుండా టేస్టీ హల్వాను రెడీ చేసి చిన్న కృష్ణుడికి పెట్టండి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు