TS News: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ గణేశ్ ప్రమాణ స్వీకారం ఈ రోజు అసెంబ్లీలో జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో శ్రీ గణేష్ తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. By Nikhil 20 Jun 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రమాణ స్వీకారం ఈ రోజు అసెంబ్లీలో జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శ్రీ గణేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ గణేశ్ కు శుభాకాంక్షలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు లాస్య నందిత. అయితే.. ఫిబ్రవరి 23న ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అక్కడ ఉప ఎన్నిక నిర్వహించింది ఈసీ. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్.. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేష్ ను పార్టీలోకి చేర్చుకుని బరిలోకి దించింది. బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి నివేదితను పోటీలో దించింది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రస్ అభ్యర్థి శ్రీ గణేష్ 13 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ రెండో స్థానంలో నిలవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపుతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65 ఎమ్మెల్యేలకు చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా.. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తాజాగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ బలం 35కు పడిపోయింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి