Pushpa 2: పుష్ఫ2 ఐటమ్ సాంగ్.. సమంతకు మించి ఊపేయనున్న బోల్డ్ బ్యూటీ

పుష్ఫ పార్ట్ 1 సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. కొన్ని రీజులు గా సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి నెట్టింట్లో వార్తలు వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో శ్రీలీల కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
Pushpa 2: పుష్ఫ2 ఐటమ్ సాంగ్.. సమంతకు మించి ఊపేయనున్న బోల్డ్ బ్యూటీ

Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. 2021 లో విడుదలైన పుష్ప పార్ట్ 1 సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన అల్లు అర్జున్ స్పెషల్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ #2024RulePushpaKa అంటూ విడుదల చేసిన హ్యాష్ ట్యాగ్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచేసింది. ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు మేకర్స్. దీంతో పుష్ప 2 వాయిదా అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

పుష్ప 2 లేటెస్ట్ అప్డేట్

ఇక తాజాగా దీని గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప పార్ట్ 1 స్పెషల్ సాంగ్ "ఊ అంటావా" లో స్టార్ హీరోయిన్ సమంత కనిపించారు. ఈ పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు మాత్రమే తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ పాటకు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకుంటున్నట్లు నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Sreeleela Latest Photos: చీరకట్టులో శ్రీలీలాను ఇలా చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే!

ప్రస్తుతం శ్రీలీల

ఇక ప్రస్తుతం శ్రీలీల తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ ఒకరిగా ఉంది. కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది ఈ బ్యూటీ. బడా హీరోలతో సైతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. నటన మాత్రమే డాన్సర్ గా కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల్లో హీరోలకు దీటుగా స్టెప్పులు వేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. తాజాగా మహేష్ బాబు సరసన శ్రీలీల నటించిన గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Also Read: Guntur Kaaram: చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్‌.. మేకింగ్‌ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్‌!

Advertisment
తాజా కథనాలు