Sreeleela : బంపర్ అఫర్ అందుకున్న శ్రీలీల.. ఏకంగా తమిళ స్టార్ హీరోతో రొమాన్స్? By Anil Kumar 26 Apr 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ajith 63 : టాలీవుడ్ లో యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గత ఏడాది అరడజనుకి పైగా సినిమాలు చేసింది. కానీ అవేవీ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయి. శ్రీలల ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేస్తుడటం అందుకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు దీంతో ప్రెజెంట్ ఆమెకి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. ఇప్పుడు శ్రీలీల చేతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో ఈ యంగ్ హీరోయిన్ కి ఇప్పుడు ఓ భారీ ఆఫర్ వచ్చింది. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్స్ తో జత కట్టిన శ్రీలీల.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోతో జోడి కట్టబోతోంది. లేటెస్ట్ కోలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం.. తమిళ టాప్ హీరో అజిత్ నటిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో శ్రీలీల కథానాయికగా ఎంపికైందట. సినిమాలో శ్రీలీల ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నట్లు తాజా సమాచారం. అజిత్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అందులో ఓ పాత్రలో యంగ్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీలీలను ఓ హీరోయిన్ గా ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ లేని ఈ ముద్దుగుమ్మకు ఏకంగా తల అజిత్ సరసన నటించే ఛాన్స్ రావడం అంటే మాములు విషయం కాదు. మరి ఈ ఆఫర్ తో శ్రీలీల కోలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర ఉండగా.. అందులో ఎవర్ని తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి ఇంకా ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఆధిక్ రవిచంద్రన్ అనే తమిళ్ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నాడు. రీసెంట్ గానే టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ జూన్ లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అజిత్ కెరీర్ లో 63 వ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read : ప్రభాస్ సరసన ‘గేమ్ ఛేంజర్’ బ్యూటీ? #sreeleela-ajith-ajith63-mythri-movie-makers-ajith-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి