Spring fans in hostels: స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆపడానికి హాస్టళ్ళలో స్ప్రింగ్ ఫ్యాన్లు..దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా!!

రాజస్థాన్ లో రోజురోజుకి పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు బ్రేక్ ఎలా వేయాలని అధికారులు ఆలోచనలో పడ్డారు. అయితే చాలా మంది ఫ్యాన్ కు ఉరి వేసుకొనే చనిపోతున్నారు. కాబట్టి ఆ ఫ్యాన్లకే ఏదో ఒకటి చేయాలని అధికారుల బుర్రకు తట్టింది. దీంతో ఓ గొప్ప ఐడియా వాళ్ళకు వచ్చింది. ఫ్యాన్లకే స్ప్రింగులు అమర్చితే పోలా.. అనుకున్నారు. ఇక తలనొప్పి వస్తే కడుపు నొప్పి బిళ్లా వేసుకున్నట్టు ఉన్న అధికారుల ఐడియా పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోతున్నారు.

New Update
Spring fans in hostels: స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆపడానికి హాస్టళ్ళలో స్ప్రింగ్ ఫ్యాన్లు..దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా!!

Spring fans in hostels: రాజస్థాన్ లో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకుంటున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే ఇందులో చాలా మంది స్టూడెంట్స్ హాస్టల్స్ లో ఫ్యాన్స్ కు ఉరి వేసుకుంటున్నారు. దీంతో హాస్టల్స్ యజమానులకు పెద్ద తలనొప్పిగా ఈ వ్యవహారం మారింది. అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోను అదే పరిస్థితి ఉండడంతో సూసైడ్ లను అరికట్టడానికి ఏదో ఒకటి చేయాలని అధికారులు భావించారు.

బల్బులా వెలిగిన స్ప్రింగ్ ఫ్యాన్ల ఐడియా..!

రోజురోజుకి పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు బ్రేక్ ఎలా వేయాలని అధికారులు ఆలోచనలో పడ్డారు. అయితే చాలా మంది ఫ్యాన్ కు ఉరి వేసుకొనే చనిపోతున్నారు. కాబట్టి ఆ ఫ్యాన్లకే ఏదో ఒకటి చేయాలని అధికారుల బుర్రకు తట్టింది. దీంతో ఓ గొప్ప ఐడియా వాళ్ళకు వచ్చింది. ఫ్యాన్లకే స్ప్రింగులు అమర్చితే పోలా.. అన్నట్టుగా ఉంది ఆ ఐడియా.

ఇకేముంది ఐడియా రావడం ఆలస్యం.. ఆలోచించకుండా హాస్టళ్లలో ఉన్న ఫ్యాన్లకు స్ప్రింగులు ఏర్పాటు చేశారు. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలని చూస్తే వారి బరువుకు ఫ్యాన్ ఊగి కిందకు వస్తుంది. దీంతో ఆత్మహత్యలను ఆపినట్లే కదా.. అన్నది వారి థాట్.

దుమ్మెత్తిపోస్తున్న సోషల్ మీడియా..!

తలనొప్పి వస్తే కడుపు నొప్పి బిళ్లా వేసుకున్నట్టు ఉన్న అధికారుల ఐడియా పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోతున్నారు. అధికారులను ఏకి పారేస్తున్నారు. దిమాక్ ఉందా అసలు మీకు అంటూ లెఫ్ట్ రైట్ తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు జరగకుండా స్ప్రింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాన్లకు ఉరి వేసుకోకుండా వేరే విధంగా ఆత్మహత్యలు చేసుకుంటే పరిస్థితి ఏంటీ.. దానికి కూడా ఇలాంటి చెత్త ఐడియాతో పరిష్కారం చూపుతారా.. అంటూ అధికారుల తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సూసైడ్స్ జరగకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలి కాని.. ఇదేం పిచ్చి పని అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు