World cup 2023:ఖాతా తెరిచిన ఆస్ట్రేలియా-శ్రీలంక మీద విజయం
2023 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మొత్తానికి తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఆస్ట్రేలియా ఛేదించింది.
2023 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మొత్తానికి తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఆస్ట్రేలియా ఛేదించింది.
వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 19న ఇండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దీంతో 90s కిడ్స్ 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై ఇండియా ఓడిపోయిన మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇండియా బంగ్లాపై గెలిచినా ఇప్పటికీ ఆ ఓటమి అభిమానులను బాధపెడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంకపై ఓడిపోయిన ఇండియా 2007వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టింది.
పసికూన జట్టు అఫ్ఘాన్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ప్రపంచకప్ చరిత్రలో ఇలా చిన్న జట్ల చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవడం ఇది మూడో సారి. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై ఇంగ్లండ్ ఓడిపోగా.. 2015 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లీష్ జట్టు పరాజయం పాలైంది. తాజాగా అఫ్ఘాన్ చేతిలోనూ ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
వరుసపెట్టి మూడు విజయాలతో వరల్డ్‌కప్‌లో మంచి జోష్‌లో ఉన్న టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19న బంగ్లాదేశ్‌తో ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బుమ్రాకు రెస్ట్ ఇచ్చి.. షమీని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అంటున్నారు.
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ఇది. 2028 లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్‌ని చేర్చింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC). ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ముంబైలో జరిగిన IOC సమావేశంలో క్రికెట్‌తో పాటు మరో నాలుగు గేమ్స్‌ని ఒలింపిక్స్‌లో చేర్చాలని నిర్ణయించారు. బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోస్ ఈ జాబితాలో ఉన్నాయి.
వరల్డ్ కప్ టోర్నీలో సంచలనం నమోదు అయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆఫ్ఘన్.. మూడో మ్యాచ్ లో ఏకంగా ఇంగ్లండ్ టీమ్ నే మట్టికరిపించింది. మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దంటూ ఒక హెచ్చరికను జారీ చేసింది.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు ముగిసిన తర్వాత బాబర్ అజామ్‌కు విరాట్ కోహ్లీ సంతకం చేసిన జెర్సీను ఇచ్చాడు. తన అంకూల్ కొడుకు కోహ్లీ టీషర్ట్ కావాలని అడిగాడని బాబర్ చెప్పాడు. దీంతో కోహ్లీ వెంటనే తన టీషర్ట్‌ను బాబర్‌కు ఇచ్చేశాడు. సమకాలీన క్రికెటర్లు ఈ ఇద్దరి మధ్య గట్టి పోటి ఉండగా.. బాబర్ అందరి ముందు కోహ్లీ దగ్గర టీషర్ట్ తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కోహ్లీ చేసిన పని పాక్ అభిమానులకు ఎంతగానో నచ్చిందట!
వన్డే ప్రపంచ కప్‌లో సక్సెస్ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా రోహిత్ నయా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు సక్సెస్ఫుల్ రన్ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్ కూడా రోహిత్‌నే. అటు టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ కోహ్లీ. టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్ఫుల్ రన్ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్ కోహ్లీ.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హైవోల్టేజ్ ఫైట్‌లో రోహిత్ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ సమయంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ వేసిన సెటైరికల్ ట్వీట్లకు భారత్ మాజీ లెజెండ్లు సచిన్, సెహ్వాగ్ తమదైన శైలీలో కౌంటర్లు ఇచ్చారు. పాక్ క్రికెటర్లకు ఫాఫ్డా జిలేబీ కనిపించిందని అందుకే 155/2 నుంచి 191కి ఆలౌట్ అయ్యే స్టేజీకి వచ్చారంటూ వేసిన కౌంటర్ ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారింది.