వావ్!.. ఈ చెస్ డ్యాన్స్ చూశారా.. గుకేష్ ఎత్తులతో ఇరగదీసారుగా..

ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్‌ కు ఇద్దరు నృత్య కళాకారిణులు వినూత్నంగా అభినందనలు తెలియజేశారు. ఆటలో గుకేశ్ ఉపయోగించిన ఎత్తులను ప్రతిభింబిస్తూ నృత్యాన్ని ప్రదర్శించారు. వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

author-image
By Archana
New Update
gukesh1

gukesh1 Photograph

Gukesh: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా గుకేశ్‌ పేరు మారుమోగుతోంది. 18 ఏళ్ళ వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకొని చరిత్రను సృష్టించాడు. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌ ఎత్తుగడలకు చెక్ పెట్టి విజేతగా నిలిచాడు.  విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ ట్రోఫీని సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచమంతా అతనిపై ప్రశంసల జల్లు కురిపించింది. 

గుకేశ్  ఎత్తులతో నృత్యం 

ఈ క్రమంలో ఇద్దరు నృత్య కళాకారిణులు విశ్వవిజేత గుకేశ్‌ వినూత్నంగా అభినందనలు తెలియజేశారు. చెస్ ఆటలో గుకేశ్ ఉపయోగించిన ఎత్తులను ప్రతిభింబిస్తూ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కథక్‌ నృత్యకారిణులు అనుష్క చందక్‌, మైత్రేయి నిర్గుణ్‌ ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. ఛాంపియన్ షిప్ ఫైనల్ లో గుకేశ్ తెల్ల పావులు, లిరెన్‌ తెల్లపావులతో ఆడారు. వీటిని ప్రతిభింభించేలా డాన్సర్లు నలుపు, తెలుపు దుస్తుల్లో నాట్య ప్రదర్శన చేశారు. ప్రత్యర్థి లిరెన్‌ ఎత్తులకు గుకేశ్ పై ఎత్తులు ఎలా సాగాయో నాట్యం ద్వారా చూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ నాట్య కళాకారిణుల సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు. 

Also Read: రణ్ బీర్ తో అలాంటి ఫోటోలో కనిపించిన పాకిస్థాన్ బ్యూటీ.. తర్వాత పాపం ఆమె జీవితం....

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు