Lionel Messi: ఫుట్‌బాల్ మ్యాచ్ కు పోలీసుల అలర్ట్.. మెస్సీకి 'Z' కేటగిరీ భద్రత

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ vs రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం 3,000 సిబ్బందితో మూడు దశల భద్రత, 450 సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ల్యాప్‌టాప్, బ్యాగులు, ఆహారం తీసుకురావద్దని సూచించారు. ప్రవేశం డిజిటల్ క్యూఆర్ కోడ్ ద్వారా జరుగుతుంది.

New Update
Lionel Messi

Lionel Messi

Lionel Messi: హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న లియోనెల్ మెస్సీ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు. సీపీ సుధీర్‌బాబు వివరాల ప్రకారం, ఈ మ్యాచ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, దేశ-విదేశాల నుంచి ప్రముఖులు హాజరవ్వనున్నారు. అందుకే సుమారు 3,000 మంది సిబ్బందితో స్టేడియం, పరిసర ప్రాంతాల్లో మూడు దశల భద్రత అమర్చారు.

స్టేడియంలో 39,000 ప్రేక్షకుల సామర్థ్యం ఉండగా, 450 సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణతో నిరంతర మానిటరింగ్ జరుగుతుంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్‌లను ఏర్పాటు చేశారు. మెస్సీకి 'జడ్' కేటగిరీ భద్రత కల్పించనున్నారు. స్టేడియానికి చేరుకునే గ్రీన్ ఛానెల్ సౌకర్యం కూడా కల్పించారు.

సీపీ సుధీర్‌బాబు అభిమానులను టికెట్ లేకుండా రోడ్ల మీదకు రాకుండా, ట్రాఫిక్ అంతరాయం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రేక్షకులు రాకపోకలకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లను ఉపయోగించడం ఉత్తమమని చెప్పారు. స్టేడియం పరిసరాల్లో 34 పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు, కానీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు రవాణాకు ప్రజలకు సూచన చేశారు.

భద్రతా కారణాల వల్ల స్టేడియంలో ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, హెల్మెట్లు, బ్యాగులు, బ్యానర్లు, వాటర్ బాటిల్స్, బయట నుంచి తీసుకువచ్చే ఆహార పదార్థాలు అనుమతించడం లేదు. మొత్తం టికెట్ జారీ, ప్రవేశం డిజిటల్ రూపంలోనే ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే ప్రేక్షకులు స్టేడియం లోపలకి ప్రవేశిస్తారు.

మ్యాచ్ ప్రారంభానికి 4 గంటల ముందు యాప్ ద్వారా స్టేడియంలో ప్రవేశం ప్రారంభమవుతుంది. ప్రేక్షకులు సాయంత్రం 4 గంటలలోపు స్టేడియంలోకి చేరుకోవడం మంచిది. మ్యాచ్ ముందు సంగీత ప్రదర్శనలు, ఇతర చిన్న కార్యక్రమాలు కూడా ఉంటాయి.

భద్రతా ఏర్పాట్లు, రవాణా, ప్రవేశ నియమాలు వంటి అన్ని వివరాలు అభిమానులకు ముందే వెల్లడించారు, ఈ భారీ మ్యాచును సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు