PAK vs NED : కొలంబోలో థ్రిల్లర్ ..  పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన నెదర్లాండ్స్

టీ20 ప్రపంచకప్ 2026 తొలిరోజే క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో అతి కష్టం మీద విజయం సాధించింది.

New Update
pak vs ned

టీ20 ప్రపంచకప్ 2026 తొలిరోజే క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో అతి కష్టం మీద విజయం సాధించింది. నెదర్లాండ్స్ నిర్దేశించిన 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి పాక్ ఆఖరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. చివరి రెండు ఓవర్లలో పాకిస్థాన్ గెలవాలంటే 29 పరుగులు చేయాలి, చేతిలో కేవలం 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. 

ఫహీమ్ అష్రఫ్ ఆకాశమే హద్దుగా

నెదర్లాండ్స్ విజయం ఖాయమనుకుంటున్న తరుణంలో ఫహీమ్ అష్రఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లోగాన్ వాన్ బీక్ వేసిన 19వ ఓవర్‌లో అష్రఫ్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఇదే ఓవర్‌లో అష్రఫ్ ఇచ్చిన క్యాచ్‌ను మాక్స్ ఓడౌడ్ వదిలేయడం నెదర్లాండ్స్ కొంపముంచింది. అప్పుడు అష్రఫ్ స్కోరు కేవలం 7 పరుగులు మాత్రమే. చివరికి 11 బంతుల్లో 29 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి అష్రఫ్ నాటౌట్‌గా నిలిచి పాకిస్థాన్‌కు విజయాన్ని అందించాడు.

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (47), సైమ్ అయూబ్ (24) మంచి ఆరంభాన్నిచ్చారు. కానీ, 11 మరియు 12వ ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో పాక్ కష్టాల్లో పడింది. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజం సహా ముగ్గురు కీలక బ్యాటర్లు తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో ఒక దశలో పాక్ 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్, పాక్ బౌలర్ల ధాటికి 147 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3 వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్ తలో రెండు వికెట్లు తీశారు. షాహీన్ అఫ్రిదికి ఒక వికెట్ దక్కింది.

Advertisment
తాజా కథనాలు