Mitchell Marsh : రూ. 3 కోట్లు పెట్టి కొంటే.. చుక్కలు చూపించాడు !

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ వరుస ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేస్తున్నాడు. ఏకంగా21 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సులున్నాయి.

New Update
marsh

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ వరుస ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేస్తున్నాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.  వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీకి బాదుతున్నాడు. దీంతో ఏకంగా21 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు మార్ష్ . ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సులున్నాయి. ప్రస్తుతం  ఢిల్లీ క్యాపిటల్స్ 8 ఓవర్లకు గానూ 98 పరుగులు చేసింది.  క్రీజులో మిచెల్ మార్ష్ (51), నికోలస్ పూరన్ (31) పరుగులతో ఉన్నారు.  కాగా లక్నో జట్టు మిచెల్ మార్ష్ ను ఐపీఎల్ 2025వేలంలో  రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు