/rtv/media/media_files/2025/09/14/odi-2025-09-14-15-18-40.png)
ODI
ఈ నెల 30 నుంచి మహిళా వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇందుకు సన్నద్ధ సన్నద్ధముగా నేడు భారత్ ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్‌లోని ముల్లన్‌పుర్ మైదానం వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది.
భారత జట్టు కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరిస్తోంది. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో భారత మహిళల జట్టు 0-3 తేడాతో ఓడిపోయింది. మరి ఈ సిరీస్ లో గెలిచి భారత్ ఓటమికి ప్రతీకారం తీర్చుకొంటుందా? చూడాలి. దాదాపు తొమ్మిది నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ కి ఈ సారి జట్టులో అడుగుపెట్టే అవకాశం దక్కలేదు.
ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలాగే జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. ఈ సిరీస్ రాబోయే మహిళల వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహకంగా ఉంటుంది.
భారత మహిళ జట్టు
భారత్మ హిళల జట్టు నుంచి ప్రతీకా రావల్, మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ (C), రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి, స్నేహ్ రాణా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్ మ్యాచ్ ఆడుతున్నారు.
ఆస్ట్రేలియా జట్టు
ఆస్ట్రేలియా నుంచి అలీసా హీలీ(w/c), లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, మూనీ, అన్నాబెల్, ఆష్లీ, తహ్లియా మెక్రాత్, జార్జియా, కింగ్, కిమ్ గార్త్, మేగాన్ ఆడుతున్నారు.