/rtv/media/media_files/2025/04/16/TUQas4TAZ5cGcT4fgT35.jpg)
dc-vs-rr match
ఐపీఎల్ 2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ (9), అభిషేక్ పొరెల్(49) మంచి శుభారంభాన్ని అందించారు. అభిషేక్ పొరెల్ దూకుడుగా జట్టు స్కోరు బోర్డును పెంచాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో 23 పరుగులు రాబట్టాడు. వరుసగా 4, 4, 6, 4, 4 బాదేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్
34 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన 2.3 ఓవర్‌కు జేక్ ఫ్రేజర్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(38) తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు పొరెల్. అయితే 97 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే అభిషేక్ పొరెల్ కూడా ఔటయ్యాడు. దీంతో 106 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
అనంతరం స్టబ్స్ (34), అక్షర్ (34) ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచారు. హసరంగ వేసిన 16 ఓవర్లో అక్షర్ పటేల్ తొలి మూడు బంతులకు వరుసగా 4, 4, 6 బాదేశాడు. ఈ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. ఇద్దరు 19 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించగా వీరి జోడీని తీక్షణ విడదీశాడు. చివర్లో స్టబ్స్, అశుతోష్ శర్మ(11) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ జట్టు 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, మహీశ్ తీక్షణ, వానిందు హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు.
DC after 15 overs - 111/4.
— Krishna yaduvanshi (@cricxkrishnaa) April 16, 2025
DC after 20 overs - 188/5.
All Thanks to Axar, Stubbs & Ashutosh.#DCvsRR#RRvsDC#DCvsRRpic.twitter.com/Oxz58WsB2i
Follow Us