/rtv/media/media_files/2025/03/14/rhDsFQ61SKIaDmm4Y1VK.jpg)
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ పేరును ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. కేఎల్ రాహుల్ ఉన్నా అక్షర్ పేరును అనౌన్స్ చేసింది. పటేల్ 2019 నుంచి ఢిల్లీ తరఫున ఆడుతున్నారు. అక్షర్ పటేల్ ఇప్పటివరకు150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 131 స్ట్రైక్ రేట్‌తో 1653 పరుగులు చేశాడు. 7.28 ఎకానమీ రేట్‌తో 123 వికెట్లు పడగొట్టాడు.
"ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు చాలా గౌరవం, నాపై నమ్మకం ఉంచినందుకు మా యజమానం, సహాయక సిబ్బందికి నేను చాలా కృతజ్ఞుడిని" అని అక్షర్ పటేల్ అన్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్ ఇప్పుడు 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ను ఎలా ముందుకు తీసుకు వెళ్తాడన్నది చూడాలి.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న కేఎల్ రాహుల్ ఈ సీజన్ రెండు ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. తన భార్య అతియా శెట్టి గర్భం దాల్చడం వల్ల రాహుల్ వైజాగ్ లో జరిగే మ్యాచ్ లకు దూరం కానున్నాడు. రాహుల్ తొలిసారి ఢిల్లీ జట్టు తరుపున అడుతున్నాడు. అంతకుముందు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లకు నాయకత్వం వహించిన అనుభవం రాహుల్‌కు ఉంది.
A new era begins today 💙❤️ pic.twitter.com/9Yc4bBMSvt
— Delhi Capitals (@DelhiCapitals) March 14, 2025
ఏ జట్టు కెప్టెన్ ఎవరు?
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ పాట్ కమ్మిన్స్
రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజు శాంసన్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్
ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్
గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మాన్ గిల్
పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.
Also read : ఎంత బలుపురా.. మద్యం మత్తులో100 స్పీడ్తో కారు నడిపి.. మహిళ స్పాట్ డెడ్