Women Cricketer: గదిలోకి పిలిచి చెంప పగలకొట్టింది: మహిళా కెప్టెన్‌పై సంచనల ఆరోపణలు

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో ఒక్కసారిగా తీవ్రమైన ఆరోపణలు భగ్గుమన్నాయి. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆమె వైఖరి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

New Update
Bangladesh women's cricket team captain (1)

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో ఒక్కసారిగా తీవ్రమైన ఆరోపణలు భగ్గుమన్నాయి. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆమె వైఖరి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జూనియర్లను గదిలోకి పిలిచి చెంపదెబ్బలు కొట్టినట్లు ఆ జట్టులోని ఒక ప్లేయర్ మీడియాతో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా జరిగిన 2025 ప్రపంచకప్ సమయంలోనూ ఆమె జూనియర్ ప్లేయర్లను కొట్టిందని బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జహానారా ఆలం మీడియా ముందు చెప్పడంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Bangladesh women's cricket team 

బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా తన జూనియర్ క్రీడాకారిణులపై దాడి చేసిందని ఆరోపిస్తూ జహానారా ఆలం సంచలనాత్మక ఆరోపణలు చేసింది. 2025 మహిళల ప్రపంచ కప్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ జట్టుకు దూరంగా ఉన్న జహానారా ఆలం ఈ వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్ వార్తాపత్రికతో ఆమె మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్ నిగర్ సుల్తానా ఆటగాళ్లను కొడుతుంది. ఆమెకు ఇదేమి కొత్త కాదు. ఈ 2025 ప్రపంచ కప్ సమయంలోనూ అదే జరిగింది. 

జూనియర్ ఆటగాళ్ళు నాతో మాట్లాడారు. ‘నేను మళ్ళీ ఇలా చేయను.. నన్ను మళ్ళీ కొడతారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. నిన్న కూడా నన్ను కొట్టారు అని కొంతమంది చెప్పిన మాట నేను విన్నాను. దుబాయ్ పర్యటనలో కూడా నిగర్ ఒక జూనియర్ క్రీడాకారిణిని గదికి పిలిచి చెంపదెబ్బ కొట్టింది.’’ అని ఫాస్ట్ బౌలర్ జహానారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. 

అదే సమయంలో జట్టులో ఉన్న సమస్యలను ఆమె ఎత్తి చూపారు. రాజకీయ కారణాల వల్ల తనను, ఇతర ఆటగాళ్లను జట్టు నుండి మినహాయించారని ఆమె ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా జట్టులో ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే మంచి సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. తనలాంటి సీనియర్ ఆటగాళ్లను మినహాయించే ప్రక్రియ 2021 పోస్ట్ కోవిడ్ శిక్షణా శిబిరంతో ప్రారంభమైందని పేర్కొన్నారు. 

ఆమె వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించింది. 2025లో జహానారా ఆలం జాతీయ జట్టు నుండి తొలగించబడటానికి ఆమె మానసిక ఆరోగ్య సమస్యలే కారణమని బిసిబి పేర్కొంది. ఆమె ఆస్ట్రేలియాలో నివసిస్తుంది. జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం లేదని తెలిపింది. జహానారా చేసిన తీవ్రమైన ఆరోపణలను ఖండిస్తూ  ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపింది.

Advertisment
తాజా కథనాలు