Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీమ్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ఇప్పటికే వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా శనివారం 2-1తో పాకిస్థాన్‌ను ఓడించి సెమీస్ పోరుకు సిద్ధమైంది. కెప్టెన్ హార్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేయగా.. పాక్ తరఫున అహ్మద్ నదీమ్ ఒక గోల్ కొట్టాడు. ఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే సెమీస్ ఉ చేరుకోగా.. రౌండ్ రాబిన్ విధానంలో టోర్నీ జరుగుతోంది.
మైదానంలో దూకుడు చూపించాల్సిందే..
ఇదిలా ఉంటే ఈ విజయం తర్వాత సంతోషం వ్యక్తం చేసిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్.. ‘పాక్ జట్టులో కొంతమంది ఆటగాళ్లతో జూనియర్ స్థాయి నుంచి పోటీపడుతూనే ఉన్నాం. వాళ్లతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వారంతా మా సోదరుల్లాంటివారే. మైదానంలో మాత్రం ప్రత్యర్థులే. భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఆటను కొనసాగిస్తాం. దాయాదుల పోరుకోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. పాక్ లాంటి జట్టుతో ఆడుతున్నప్పుడు గతాన్ని మరిచి ధీటుగా ఆడాల్సిందే' అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ మేరకు భారత్ ఆడిన మ్యాచుల్లో చైనాపై 3-0, జపాన్‌పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై 3-1 తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పాక్ రెండో స్థానంలో ఉంది. 2013 నుంచి పాక్‌తో ఆడిన 25 మ్యాచ్‌ల్లో భారత్ 16 గెలవగా.. పాక్ 5 విజయాలు సాధించింది. 4 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. ఇక గతేడాది ఆసియా క్రీడల్లో భారత్ 10-2తో పాక్‌ను చిత్తుగా ఓడించింది.