KKR vs RCB : దంచుతున్న రహానే.. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ అజింక్య రహానే దూకుడుగా ఆడుతున్నాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు.  అద్భుతమైన సిక్స్‌తో అర్ధశతకం నమోదు చేశాడు.

New Update
kkr vs rcb

kkr vs rcb

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ అజింక్య రహానే దూకుడుగా ఆడుతున్నాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. అద్భుతమైన సిక్స్‌తో అర్ధశతకాన్ని  నమోదు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది.

అటు  సునీల్‌ నరైన్‌ (34) కూడా అదరగొడుతున్నాడు.  దీంతో వీరిద్దరూ రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని ఇప్పటికే  నమోదు చేశారు. సునీల్‌ నరైన్‌ (34), అజింక్య రహానే (54) పరుగులో క్రీజులో ఉన్నారు.9 ఓవర్లకు గానూ కోల్‌కతా స్కోర్‌ 96/1 గా ఉంది. అంతకుముందు ఓపెనర్ గా వచ్చిన   క్వింటన్‌ డికాక్‌(4) పరుగులకే వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అయిదో బంతికి వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు