రాంచీ వీధుల్లో ధోనీ చ‌క్క‌ర్లు.. వీడియో వైరల్‌...!

రెడ్‌క‌ల‌ర్ మినీ కూప‌ర్ కారులో ధోనీ చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాంచీ నగర వీధుల్లో ధోనీ ఆ కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ జోరుగా.. హుషారుగా అంటూ జాలీగా నగరమంతా తిరిగారు. అయితే ఇదిలా ఉంటే.. ధోనీ గ్యారేజీలో ఇంకెన్నో ర‌కాల వింటేజ్‌, ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి.

రాంచీ వీధుల్లో ధోనీ చ‌క్క‌ర్లు.. వీడియో వైరల్‌...!
New Update

టీమిండియా మాజీ క్రికెట‌ర్ ధోనీకి బైక్‌లంటే తెగ ఇష్టం. అంతేకాదు.. ఫ్యాన్సీ కార్ల‌ను కూడా ఆయ‌న అంతే ఇష్టపడుతాడు. ధోనీ గ్యారేజీలో వింటేజ్‌, ల‌గ్జ‌రీ, బ‌డ్జెట్ కార్లు ఉన్నాయి. ఇక ఇటీవ‌ల ఐపీఎల్ నుంచి జార్ఖండ్‌లోని స్వంత ఊరు రాంచీకి వెళ్లిన అత‌ను.. అక్క‌డ ఓ రెడ్ క‌ల‌ర్ మినీ కూప‌ర్‌లో షికారు చేశాడు. ఆ ట్రిప్‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. రాంచీ వీధుల్లో 1959 నాటి మినీ కూప‌ర్‌లో ధోనీ చ‌క్క‌ర్లు కొట్టాడు. ఆ లైట్‌వెయిట్ కారు వేగానికి మారుపేరులా ఉంటుంది.

ధోనీ ఇంట్లో ఆర్మీ కారు

ధోనీ వ‌ద్ద నిసాన్ జాంగా కారు కూడా ఉంది. ఇండియ‌న్ ఆర్మీ కోసం త‌యారు చేసిన ఈ కారును ధోనీ తెప్పించుకున్నాడు. ఆర్మీ ప‌ట్ల ఉన్న ప్రేమ‌తో ధోనీ ఆ కారును త‌న క‌లెక్ష‌న్‌లో పెట్టుకున్నాడు. సుమారు కోటిన్న‌ర ఖ‌రీదు చేసే ఫెర్రారీ 599 జీటీవో కారు కూడా ధోనీ గ్యారేజీలో ఉంది. ఇక అత్యంత ఖ‌రీదైన రోల్స్ రాయ్స్ కారు కూడా అత‌ని వ‌ద్ద ఉంది.

ధోనీ గ్యారేజీలో రకరకాల కార్ల సందడి

హ‌మ్మ‌ర్ హెచ్‌2, ఆడి క్యూ7, మిత్‌సుబిషి ప‌జెరో ఎస్ఎఫ్ఎక్స్‌, లాండ్ రోవ‌ర్ ఫ్రీలాండ‌ర్‌2, మ‌హేంద్ర స్కార్పియో, జీప్ గ్రాండ్ చిరోకీ ట్రాక్‌హాక్‌, పాంటియాక్ ఫైర్‌బ‌ర్డ్ ట్రాన్స్‌, మెర్సిడీజ్ బెంజ్ జీఎల్ఈ, రోల్స్ రాయ్స్ సిల్వ‌ర్ షాడో, హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడ‌ర్‌తో పాటు ఇంకా ఎన్నో ర‌కాల కార్లు ఉన్నాయి. ఫార్మ్‌హౌజ్‌లో స్వ‌రాజ్ ట్రాక్ట‌ర్ కూడా ఉంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe