టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీకి బైక్‌లంటే తెగ ఇష్టం. అంతేకాదు.. ఫ్యాన్సీ కార్లను కూడా ఆయన అంతే ఇష్టపడుతాడు. ధోనీ గ్యారేజీలో వింటేజ్, లగ్జరీ, బడ్జెట్ కార్లు ఉన్నాయి. ఇక ఇటీవల ఐపీఎల్ నుంచి జార్ఖండ్‌లోని స్వంత ఊరు రాంచీకి వెళ్లిన అతను.. అక్కడ ఓ రెడ్ కలర్ మినీ కూపర్‌లో షికారు చేశాడు. ఆ ట్రిప్‌కు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రాంచీ వీధుల్లో 1959 నాటి మినీ కూపర్‌లో ధోనీ చక్కర్లు కొట్టాడు. ఆ లైట్‌వెయిట్ కారు వేగానికి మారుపేరులా ఉంటుంది.
పూర్తిగా చదవండి..రాంచీ వీధుల్లో ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్…!
రెడ్‌కలర్ మినీ కూపర్ కారులో ధోనీ చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాంచీ నగర వీధుల్లో ధోనీ ఆ కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ జోరుగా.. హుషారుగా అంటూ జాలీగా నగరమంతా తిరిగారు. అయితే ఇదిలా ఉంటే.. ధోనీ గ్యారేజీలో ఇంకెన్నో రకాల వింటేజ్, లగ్జరీ కార్లు ఉన్నాయి.
Translate this News: