IND vs AUS: సిరీస్ మనదే.. ఒక మ్యాచ్ మిగిలుండగానే భారత్ ఘనవిజయం

రాయ్ పూర్ లో జరిగిన నాలుగో టీ20లో ఘన విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదింకే క్రమంలో కంగారూ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది.

IND vs AUS: సిరీస్ మనదే.. ఒక మ్యాచ్ మిగిలుండగానే భారత్ ఘనవిజయం
New Update

IND vs AUS: కంగారూలతో టీ20 సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో భారత్ కొల్లగొట్టింది. శుక్రవారం రాయ్ పూర్ లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించడంతో సిరీస్ భారత వశమైంది. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియన్ టీం ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితమైంది. మొదట్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ కొంత కంగారుపెట్టినా బౌలర్లు మెల్లిమెల్లిగా మ్యాచ్ ను భారత నియంత్రణలోకి తెచ్చారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు కీలక వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించగా; దీపక్ చాహర్ రెండు; రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.

ఇది కూడా చదవండి: టుక్‌ టుక్‌ ప్లేయర్‌కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా!

ఓపెనర్ ట్రేవిస్ హెడ్ మొదట్లో భారత్ ను ఆందోళనకు గురిచేశాడు. వేగంగా పరుగులు రాబట్టిన హెడ్ 16 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ తో 31 రన్స్ చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న అతడిని అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ముఖేశ్ కుమార్ కు క్యాచ్ ఇచ్చి హెడ్ వెనుదిరిగాడు. మొదటి వికెట్ కు జోష్ ఫిలిప్పీతో కలిసి హెడ్ 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరికాసేపటికే 8 పరుగులు చేసిన ఫిలిప్పీని రవి బిష్ణోయ్ బౌల్డ్ చేశాడు. అప్పటినుంచి ఆసిస్ కష్టాలు మొదలయ్యాయి. కీలక ఆటగాళ్లైన మెక్ డెర్మట్, ఆరోన్ హార్డీలను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ ను భారత్ వైపు మరల్చాడు. అనంతరం మాథ్యూ వేడ్ మినహా ఆసిస్ ఆటగాళ్లెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. కీలకమైన 19వ ఓవర్ లో ముఖేశ్ కుమార్ 9 పరుగులే ఇవ్వడంతో ఆసిస్ తీవ్ర ఒత్తడిలోకి వెళ్లింది. చివరి ఓవర్ లో విజయం కోసం 31 రన్స్ అవసరం కాగా, ఆవేశ్ ఖాన్ 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: రోహిత్, కోహ్లీ లేకుండానే వన్డే, టీ20 టీంలు.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ రింకూసింగ్, జితేశ్ శర్మతో పాటు ఓపెనర్లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (37; 28బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్ (32; 28బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్సర్) 50పరుగులతో మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(8), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(1) ఇలా వచ్చి అలా వెళ్లడంతో స్కోరు వేగం మందగించింది. మొత్తానికి 13వ ఓవర్ లో భారతజట్టు స్కోరు 100 దాటింది. తర్వాత క్రీజులోకి వచ్చిన భారత సెన్సేషన్ రింకూసింగ్ బౌండరీలతో పరుగుల వేగం పెంచాడు. మరోసారి సత్తా చాటిన రింకూ (46; 29బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లతో) చివరి ఓవర్లో ఔటయ్యాడు. జితేశ్ శర్మ కూడా క్రీజులో ఉన్నంత సేపూ మెరుపులు మెరిపించాడు. మొత్తం 19 బంతులు ఆడిన జితేశ్ 3 సిక్సర్లతో పాటు ఒక బౌండరీ బాది 35 పరుగులు రాబట్టాడు. రింకూ, జితేశ్ కలిసి ఐదో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. అయినప్పటికీ క్రమం తప్పకుండా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత్ ఊహించినంత భారీ స్కోరు సాధించలేకపోయింది. ఆసిస్ బౌలర్లలో బెన్ ద్వార్షిస్ మూడు, తన్వీర్ సంఘా రెండు, బ్రెండార్ఫ్ రెండు, ఆరోన్ హార్డీ ఒక వికెట్ పడగొట్టారు.

4వేల పరుగుల లిస్టులో గైక్వాడ్:
ఈ మ్యాచ్ తో టీ20లో 4వేల పరుగులు సాధించిన ఆటగాల్ల లిస్టులో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేరాడు. రుతురాజ్ 116 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

#ind-vs-aus-t20-series #raipur-t20
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe