ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ-20 బ్లాస్ట్ టోర్నీలో .. సర్రే బ్యాటర్ విల్ జాక్స్ దుమ్మురేపాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో గాయం కారణంగా ఆ టోర్నీలో ఆడలేకపోయిన ఆర్సీబీ బ్యాటర్.. టీ20 బ్లాస్ట్‌లో మాత్రం చెలరేగిపోయాడు. మిడిల్సెక్స్ బౌలర్ లూక్ హోల్మాన్ బౌలింగ్‌లో వరుసగా అయిదు సిక్సర్లు కొట్టాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. అయితే ఆరో బంతిని బౌలర్ ఫుల్‌టాస్‌గా వేశాడు.. ఆ బంతిని కూడా భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు విల్ జాక్స్. కానీ సింగిల్ రన్ మాత్రమే వచ్చింది. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్, గిబ్స్ రికార్డును అతను తృటిలో మిస్సయ్యాడు. ఆ హిట్టింగ్ ఇంట్రస్టింగ్ వీడియోని చూడండి..
బ్యాటర్ విల్ జాక్స్‌ను ఆర్సీబీ 3.2 కోట్లు కొనుగోలు చేసింది. గత ఏడాది జరిగిన వేలంలో అతన్ని ఆర్సీబీ సొంతం చేసుకున్నది. అయితే మీర్పూర్లో బంగ్లాతో జరిగిన వన్డే సమయంలో అతను గాయపడ్డాడు. దీంతో ఐపీఎల్‌కు ఈసారి ఆడలేకపోయాడు. నిజానికి ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేశాడు. మిడిల్సెక్స్తో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో జాక్స్ 45 బంతుల్లో 96 రన్స్ చేశాడు. సర్రే విసిరిన 253 రన్స్ టార్గెట్‌ను మిడిల్సెక్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే అందుకున్నది.
https://twitter.com/CricCrazyJohns/status/1671946879666638848?s=20