40 ఏళ్ల వయసులో అండర్సన్ అదిరిపోయే రికార్డు!

యాషెస్ సిరీస్‌ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ సరికొత్త చరిత్రను సృష్టించాడు. 4 పదుల వయసులోనూ దుమ్ములేపుతున్న అండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1,100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు ఫిట్‌నెస్ విషయంలో కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నాడు.

40 ఏళ్ల వయసులో అండర్సన్ అదిరిపోయే రికార్డు!
New Update

sports-england-legendary-pacer-james-anderson-completed-1100-wickets-in-first-class-career

యాషెస్ సిరీస్‌ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. 4 పదుల వయసులోనూ దుమ్ములేపుతున్న అండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1,100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీని పెవిలియన్ చేర్చడం ద్వారా అండర్సన్ ఈ రికార్డును అందుకున్నాడు. ఆదివారం మొదటి సెషన్‌లో తన నాలుగో ఓవర్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న అలెక్స్ క్యారీ (66) ని క్లీన్ బౌల్డ్ చేసిన అండర్సన్.. ఆరో వికెట్‌కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి నెలకొల్పిన సెంచరీ పాట్నర్‌షిప్‌కు సడెన్‌ బ్రేక్ వేశాడు.

మూడో స్థానంలో నిలిచిన అండర్సన్

కాగా.... 2002 సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేసిన అండర్సన్.. ఇప్పటివరకు 289 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 54 సార్లు 5 వికెట్ల హాల్స్, 6 సార్లు 10 వికెట్ల హాల్స్ ఉన్నాయి. అత్యుత్తమ గణాంకాల్లో 7/19 ఒకటి. ఇక అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి 2003 సంవత్సరంలో అడుగుపెట్టిన అండర్సన్ ఇప్పటివరకు 180 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 686 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 32 సార్లు 5 వికెట్ల హాల్స్, 3 సార్లు 10 వికెట్ల హాల్స్ ఉన్నాయి. అత్యుత్తమ గణాంకాలు 7/42. కాగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ మూడో స్థానంలో నిలిచి రికార్డును సొంతం చేసుకున్నాడు.

యువతకు సవాల్‌ విసురుతున్న అండర్సన్

ప్రస్తుతం అండర్సన్ వయసు 40 సంవత్సరాలు. ఈ వయసులో శరీరం సహకరించక తన ఫ్యామిలీకి టైం కెటాయించి తన కుటుంబంతో ఎంజాయ్‌ చేసేందుకు చాలామంది ఆటగాళ్లు త్వరగా రిటైర్మెంట్‌ను ప్రకటిస్తారు. కానీ అండర్సన్ మాత్రం అలాకాదు... వయసు నా బాడీకే కానీ నా మనసుకు కాదంటున్నాడు. ఈ వయసులోనూ తగ్గేదేలే అంటూ నిప్పులు చెరుగుతూ తనదైన స్టైల్‌లో దుమ్ములేపుతున్నాడు. ఈ వయసులోనూ ఫిట్‌గా ఉండి, ఫిట్‌నెస్ విషయంలో కుర్రాళ్లకు పెను సవాల్‌ను విసురుతున్నాడు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe