అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్..షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

క్రికెట్ వరల్డ్ కప్ మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్​ కప్ టోర్నీ జరగనుంది. నవంబర్ 15న ఇదే వేదికపై... భారత్​-పాక్​ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నారు. ఈ మేరకు.. ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​ - 2023 షెడ్యూల్‌ను ఓ ప్రకటనలో విడుదల చేసింది.

World Cup: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?
New Update

sports-cricket-icc-world-cup-2023-schedule-released-india-vs-pakistan-on-october-15-final-in-ahmedabad-state

భారత్‌ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి నవంబర్‌ 19 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్‌ 8న అస్ట్రేలియాతో భారత్‌.. చెన్నై వేదికగా తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న భారత్‌-పాక్​తో తలపడనుంది. మరోవైపు లీగ్‌ దశలో టీమ్‌ఇండియా మొత్తం 8 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్‌ 15, 16న ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు జరగ్గా.. అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్‌ ఉండనుంది. హైదరాబాద్‌ వేదికగా 3 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇక.. ఈ వరల్డ్​ కప్​నకు హైదరాబాద్, అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, లఖ్​నవూ, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా సహా మొత్తం 10 వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. హైదరాబాద్‌తో పాటు గువాహటి, తిరువనంతపురం.. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వార్మప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక రెండు సెమీ-ఫైనల్‌లకు రిజర్వ్ డే ఉంటుంది. ఈ ఫైనల్​కు నవంబర్ 20 రిజర్వ్ డే గా నిర్ణయించారు.

ఇక దిల్లీ వేదికగా అక్టోబర్‌ 11న భారత్‌ - అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుండగా.. పుణె వేదికగా అక్టోబర్‌ 19న భారత్‌ - బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఉండనుంది. అంతే కాకుండా ధర్మశాల వేదికగా అక్టోబర్‌ 22న భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌, లఖ్‌నవూ వేదికగా అక్టోబర్‌ 29న భారత్‌ - ఇంగ్లాండ్‌ మ్యాచ్‌, కోల్‌కతా వేదికగా నవంబర్‌ 5న భారత్‌ - దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.

భారత జట్టు ఆడే మ్యాచ్ లు..

sports-cricket-icc-world-cup-2023-schedule-released-india-vs-pakistan-on-october-15-final-in-ahmedabad-state

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe