SpiceJet Crisis: రెండున్నరేళ్లుగా ఉద్యోగుల పీఎఫ్ డబ్బు డిపాజిట్ చేయని ఎయిర్ లైన్స్!

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బును డిపాజిట్ చేయడం లేదు. గత రెండున్నరేళ్లుగా స్పైస్‌జెట్ ఎంప్లాయీస్ పీఎఫ్ డబ్బును జమచేయడం లేదని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ CNBCకి సమాచారాన్ని అందించింది.

New Update
SpiceJet Crisis: రెండున్నరేళ్లుగా ఉద్యోగుల పీఎఫ్ డబ్బు డిపాజిట్ చేయని ఎయిర్ లైన్స్!

SpiceJet Crisis:  ఆర్థిక సంక్షోభం, న్యాయపరమైన సమస్యలతో సతమతమవుతున్న ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్.. గత రెండున్నరేళ్లుగా తన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బును డిపాజిట్ చేయలేదు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ సమాచారాన్ని CNBCకి అందించింది.

Spice Jet Crisis:  స్పైస్‌జెట్ చివరిసారిగా జనవరి 2022లో 11,581 మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఇందుకోసం విమానయాన సంస్థకు నోటీసులు, సమన్లు ​​పంపినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఎయిర్‌లైన్ ప్రస్తుతం అనేక చట్టపరమైన విషయాలపై పోరాడుతోంది.

SpiceJet Crisis:  EPFO చట్టం ప్రకారం, కంపెనీ 12% ఉద్యోగి PF ఖాతాలో జమ చేస్తుంది. కంపెనీ కూడా 12% కంట్రిబ్యూషన్‌ను ఉద్యోగి PF ఖాతాలో జమ చేస్తుంది. కంపెనీ కంట్రిబ్యూషన్‌లో 3.67% EPF ఖాతాలో జమ అవుతుంది. కాగా, పెన్షన్ పథకంలో 8.33% మొత్తం డిపాజిట్ అవుతుంది. ప్రస్తుతం స్పైస్‌జెట్ కంపెనీపై అనేక లీగల్ కేసులు నడుస్తున్నాయి
ఈ కేసుల్లో కొన్ని విమానాల లీజు పొడిగింపుకు సంబంధించినవి. అంతకుముందు ఏప్రిల్‌లో, ముగ్గురు విమానాలను అద్దెకిచ్చే వారు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌లో మొత్తం రూ.77 కోట్ల డిఫాల్ట్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) స్పైస్‌జెట్‌కు నోటీసు జారీ చేసింది.

ఈ ఏడాది 7.62% పడిపోయిన స్పైస్‌జెట్ షేరు..
స్పైస్‌జెట్ షేర్లు క నెలలో 0.39%.. 6 నెలల్లో 8.30% ప్రతికూల రాబడిని ఇచ్చాయి.ఈ ఏడాది మాత్రమే చూస్తే.. అంటే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్లు 7.62 శాతం ప్రతికూల రాబడిని ఇచ్చాయి.

Advertisment
తాజా కథనాలు