Bombay High Court : వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డ పై హక్కు ఉండదు!

వీర్య, అండ దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్‌ పేర్కొంది. అంతేకాకుండా వారికి బయోలాజికల్‌ తల్లిదండ్రులుగా కూడా చెప్పుకునే హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మిలింద్ జాదవ్‌‌ మంగళవారం తీర్పు వెలువరించారు.

Bombay High Court : వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డ పై హక్కు ఉండదు!
New Update

Bombay High Court Says : వీర్య, అండ దాతలకు (Sperm & Egg Donor) బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్‌ (Bombay High Court) పేర్కొంది. వారిని పిల్లలకు జీవ సంబంధ తల్లిదండ్రులుగా చెప్పకూడదని వివరించింది.. తన కవల కూతుళ్లను చూసేందుకు అనుమతించాలని ఓ మహిళ వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

తన పిల్లలు అద్దె గర్భం (Surrogacy) ద్వారా పుట్టారని.. వారు తన భర్త, సోదరితో కలిసి ఉంటున్నారని పిటిషనర్‌ కోర్టుకు తెలియజేసింది. తన సోదరే తనకు అండం దానం చేసిందని.. అయితే ఆమెకే పిల్లలపై చట్టబద్ధ హక్కు ఉంటుందని తన భర్త ఆమెతో వాదిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. భర్త వాదనను కోర్టు తోసిపుచ్చింది.

విభేదాల కారణంగా 2021లో పిటిషనర్‌ భర్త ఇద్దరు పిల్లలను తీసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ పిల్లల బాగోగులను పిటిషనర్‌ సోదరి చూసుకుంటుందని సదరు భర్త తెలియజేయడంతో ఆమె స్థానిక కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆమె అభ్యర్థన తిరస్కరణకు గురి కావడంతో హైకోర్టులో కేసు వేశారు.

Also Read: రేపే రూ.2 లక్షల రుణమాఫీ!.. టింగ్ టింగ్ మని మోగనున్న ఫోన్లు

#bombay-high-court #petitioners #biological-parents
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe