Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ఉన్న తన నివాసంలో నేటి నుంచి మూడు రోజుల పాటు యాగాలు నిర్వహించనున్నారు. యాగాలు, పూజలు నిర్వహిస్తారు. ఇందులో శతచండీ, పారాయణ , మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాలు ఉన్నాయి. చంద్రబాబు, భవనేశ్వరి దంపతులు ఈయాగంలో పాల్గొంటున్నారు. ఇందులో భారీ ఏర్పాట్లు చేశారు. యాగాలు, పూజల నేపథ్యంలో చంద్రబాబు ఈ మూడు రోజుల పాటు తన అపాయింట్ మెంట్ల ను మొత్తం రద్దు చేసుకున్నారు.
తన 4 శతాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా జైలుకు వెళ్లి వచ్చిన చంద్రబాబు బెయిల్ బయటకు వచ్చాక వరుసగా దైవదర్శనాలతో బిజీగా ఉంటున్నారు. ఇందులో తిరుమల శ్రీవారిని, బెజవాడ దుర్గమ్మను, గుణదల మేరీమాత ఆలయాలను ఇప్పటికే దర్శించుకున్నారు చంద్రబాబు. అలాగే తమిళనాడులోని అక్కడి దేవాలయాలను దర్శించుకున్నారు. ఇప్పుడు తన ఇంట్లోనే ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఇక రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ కలిసి రాకపోయినా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నారు. తన అరెస్టు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు కలిపి వస్తాయని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. త్వరలో అమరావతిలో భారీ సభ పెట్టి టిడిపి జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.