Summer Special Rices: సమ్మర్‌లో కడుపును చల్లగా ఉంచే స్పెషల్‌ రైస్‌లు..ఒక సారి ట్రై చేయండి

వేసవి కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పుదీనా రైస్, పెరుగు అన్నం, పచ్చి కొత్తిమీర అన్నం, క్యాప్సికమ్, లెమన్ రైస్ వేసవిలో తినేందుకు కూడా బెస్ట్‌ అని నిపుణులు అంటున్నారు. ఇది కడుపును చల్లగా, వేసవి తాపం నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.

New Update
Summer Special Rices: సమ్మర్‌లో కడుపును చల్లగా ఉంచే స్పెషల్‌ రైస్‌లు..ఒక సారి ట్రై చేయండి

Summer Special Rices: వేసవి కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. త్వరగా తయారు చేసుకోగలిగేవి, తినడానికి ఆరోగ్యకరమైనవి ఎంచుకోవాలి. కొన్ని రైస్‌తో చేసిన వంటకాలు రుచితో పాటు ఆరోగ్యం, అంతేకాకుండా వేసవిలో కడుపును చల్లగా ఉంచుతాయి. మీ అన్నంలో కారంగా ఉండాలనుకుంటే లెమన్ రైస్ ఒక గొప్ప ఎంపిక. నిమిషాల్లో దీన్ని సిద్ధం చేసుకుని రుచికరమైన సాంబార్‌తో ఆస్వాదించవచ్చు.

publive-image

పెరుగు అన్నం కడుపులో చల్లగా ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి ఎంతో రీఫ్రెష్‌మెంట్‌ ఇస్తుంది. పెరుగు చప్పగా ఉంటుందనుకుంటే కాస్త తాలింపు వేసుకుని తినవచ్చు. వేసవి తాపం నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. వేసవిలో తప్పక ప్రయత్నించాల్సిన మరో ప్రత్యేక రైస్ రెసిపి పుదీనా రైస్. ఈ వంటకం ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషపరుస్తుంది. అంతేకాకుండా మళ్లీ మళ్లీ తినాలని కోరుకోవడం ఖాయం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. వేసవిలో తినేందుకు కూడా బెస్ట్‌ అని నిపుణులు అంటున్నారు.

publive-image

పచ్చి మామిడి రుచితో పాటు పోషక విలువలు కలిగి ఉంటుంది. దీనితో రైస్‌ చేసుకోవడం వల్ల టేస్ట్‌ అదిరిపోతుంది. అంతేకాకుండా వేసవిలో కడుపునిండిన భావన కలుగుతుంది. రోగ నిరోధకశక్తి కూడా బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. పచ్చి కొత్తిమీర అన్నం కూడా వేసవిలో తినేందుకు చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, క్యాప్సికమ్, పెరుగుతో తయారు చేసిన రైస్‌ ఆరోగ్యంతో పాటు మంచి రుచిని ఇస్తుంది. చివరగా కొత్తిమీర గార్నిష్‌ చేస్తే చూసేందుకు కూడా బాగుంటుంది.

ఇది కూడా చదవండి:  సడెన్‌గా నరాలు ఎందుకు ఉబ్బుతాయి..నివారణ ఎలా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు