Passport Drive : పాస్ పోర్ట్ సేవలను వేగంగా అందించేందుకు ఈనెల 14వ తేదీన ప్రత్యేక పాస్ పోర్టు డ్రైవ్ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ రీజినల్ పాస్ట్ పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు.
పాస్ పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్ మెంట్ కోసం ఎంతోకాలం వేచి ఉండకుండా ఈ నెల 14వ తేదీని పాస్ పోర్టు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి దాసరి బాలయ్య పేర్కొన్నారు. బేగంపేట, అమీర్ పేట్, టోలిచౌకీ, నిజామాబాద్, కరీనంనగర్ లోని పాస్ పోర్టు సేవా కేంద్రాలు, భువనగిరి, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, వరంగల్ లోని పోస్టాపీస్ పాస్ పోర్టు సేవా కేంద్రాల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ తేదీ అపాయింట్ మెంట్స్ పాస్ పోర్టు వెబ్ సైట్లో త్వరలోనే విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
మీరు ప్రపంచయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? వీసా అనుమతుల కోసం వేచిఉండాల్సిన అవసరం లేదు. మీకు భారత్ పాస్ పోర్టు ఒక్కటి ఉంటే చాలు. ప్రపంచంలోని 59 దేశాల్లో వీసా అవసరం లేకుండా ఆన్ అరైవల్ తో పర్యటించవచ్చు. ఈ మేరకు హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ అనే సంస్థ 2023లో ప్రపంచంలోనే శక్తివంమైన పాస్ట్ పోర్టు లిస్టును రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ సంస్థ 199 దేశాలతో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 85వస్థానంలో నిలిచింది. గతేడాది ఈ ర్యాంకింగ్స్ లో భారత్ 83వ స్థానంలో ఉంది.
ఇది కూడా చదవండి: మూడు కోర్టుల్లో చంద్రబాబు కేసుల మీద నేడు విచారణ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ