Parliament Session: పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త యూనిఫాం!

కొత్త భవనంలో తొలిసారి సమావేశాలు నిర్వహిస్తున్న వేళ అందులో పని చేసే ఉద్యోగుల డ్రెస్‌ కోడ్‌ (Dress Code) కూడా మార్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కొత్త యూనిఫామ్‌ ను రూపొందించినట్లు కూడా తెలుస్తుంది.

 Parliament Session: పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త యూనిఫాం!
New Update

మరి కొద్ది రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకుని వస్తుంది. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో తెర మీదకి మరో కొత్త అంశం వచ్చి చేరింది. ఇప్పటికే పార్లమెంట్ (Parliament) సమావేశాలను(session) వినాయక చవితి(Ganesh Chaturdhi) రోజు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది.

కొత్త భవనంలో తొలిసారి సమావేశాలు నిర్వహిస్తున్న వేళ అందులో పని చేసే ఉద్యోగుల డ్రెస్‌ కోడ్‌ (Dress Code) కూడా మార్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కొత్త యూనిఫామ్‌ ను రూపొందించినట్లు కూడా తెలుస్తుంది. ఉద్యోగుల కొత్త వేషధారణ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేస్తాయని పార్లమెంట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పార్లమెంట్ హౌస్‌ లో ఉండే మార్షల్స్‌ ఇప్పటి వరకు సఫారీ సూట్‌ లు ధరించి విధులు నిర్వహించేవారు. ఇక నుంచి వాటికి బదులుగా లైట్‌ క్రీమ్‌ కలర్‌ కుర్తాలు , పైజామా ధరించి పార్లమెంట్ లో ఉంటారని తెలిపారు. ఇదిలా ఉంటే పీజీడీ ధరించే డ్రెస్‌ లో కూడా మార్పు ఉంటుందని తెలిపారు.

అలాగే మహిళా ఉద్యోగులు కూడా కొత్త డిజైన్‌ చీరలు ధరించే విధులకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు సెక్రటేరియట్‌ ఉద్యోగులు పూర్తిగా మూసి ఉన్న నెక్‌ సూట్ ధరించే వారు. ఇప్పుడు దాని స్థానంలో మెజెంటా లేదా డార్క్‌ పింక్‌ నెహ్రు జాకెట్ మారుతుంది. అలాగే పురుషులు ముదురు గులాబీ రంగులో చొక్కాలు ధరించగా వాటి పై కమలం ఉంటుంది. దానికి మ్యాచింగ్‌ గా ఖాకీ ప్యాంట్‌ ధరించనున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే రెండు సభల్లోని మార్షల్స్‌ మణిపురి తలపాగాలు చుట్టుకుని ఉంటారు. భద్రతా సిబ్బంది డ్రెస్‌ కోడ్‌ కూడా పూర్తిగా మారబోతోంది. ఇక నుంచి సఫారీ సూట్‌ లకు బదులు మిలటరీ తరహా దుస్తులు ధరించనున్నారు. వీరందరికీ కూడా నిఫ్ట్‌ దుస్తులను రూపొందిస్తుంది.

గణేశ్‌ చతుర్థి సందర్భంగా కొత్త భవనంలో పూజ నిర్వహించిన తర్వాత సమావేశాలను కొనసాగించనున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి కేంద్రం ఇప్పటికే పిలుపునిచ్చింది. అయితే సమావేశాలకు సంబంధించిన అజెండాను మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వెల్లడించలేదు.

ఇప్పటికే కొన్ని విపక్ష పార్టీలు ఈ సమావేశాలు ముఖ్య అజెండా ఏంటి అనేది తెలియజేయాలని ప్రధాని మోడీకి లేఖలు కూడా రాశారు. అయితే కేంద్రం ఇప్పటికే తెర మీదకు వన్‌ నేషన్‌ వన్ ఎలక్షన్‌ అనే అంశాన్ని తెర మీదకు తెచ్చింది. దీనితో పాటు భారత్ పేరు మార్పు వంటి కీలక బిల్లులను కేంద్రం ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

#special-session #parliament
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe