గ్రామాల్లో 'ప్రత్యేక' పాలన.. స్పెషల్‌ ఆఫీసర్లను నియమించిన ప్రభుత్వం

సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకాధికారి, కార్యదర్శికి కలిపి ఉమ్మడిగా ప్రభుత్వం చెక్ పవర్‌ కల్పించింది.

New Update
గ్రామాల్లో 'ప్రత్యేక' పాలన.. స్పెషల్‌ ఆఫీసర్లను నియమించిన ప్రభుత్వం

Special officers in villages: సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సుముఖంగా లేని ప్రభుత్వం ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు, ఎంపీఓ, డీటీ, ఆర్‌ఐ, ఇంజనీర్లు, ఇతర గెజిటెడ్‌ అధికారులను ఆయా మండలాల్లోని గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించింది. సర్పంచ్‌ల పదవీకాలాన్ని పొడిగించాలన్న విజ్ఞప్తులు వచ్చినా ప్రభుత్వం ఆ దిశగా ఆసక్తి చూపలేదు. దీంతో రాష్ట్రంలోని గ్రామాల్లో పది సంవత్సరాల అనంతరం మళ్లీ ప్రత్యేకాధికారుల పాలన మొదలు కాబోతోంది. గతంలో ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2011 నుంచి 2013 వరకు; 2018లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కాలుష్య రహిత మూసీ నదిగా మార్చేలా ప్రణాళిక చేశాం: సీఎం రేవంత్

చెక్‌పవర్‌ ఎవరికి?
ఇప్పటివరకు సర్పంచులు, ఉప సర్పంచులకు ఉమ్మడిగా చెక్‌పవర్‌ కొనసాగింది. అయితే, శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారి, కార్యదర్శికి ఉమ్మడిగా ప్రభుత్వం చెక్ పవర్‌ కల్పించింది. డిజిటల్ కీ అథారిటీ ప్రత్యేకాధికారి చేతిలో ఉంటుంది. కాగా, గతంలో సర్పంచ్‌ల వద్ద ఉన్న డిజిటల్ కీలు, చెక్కులు, ఇతరత్రా రికార్డులన్నిటినీ సీజ్ చేయాలని పంచాయతీ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. వాటిలో ఎలాంటి సమస్య తలెత్తినా కార్యదర్శిదే బాధ్యత అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటి నుంచి గ్రామ పంచాయతీల్లో నిధులన్నింటికీ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత. శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారులు విధుల్లో చేరుతారు. వారికి ప్రభుత్వం డిజిటల్‌ సంతకాలకు సంబంధించిన కీలను ఇస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు