TTD: హిందూమతం స్వీకరించాలనుకునే ఇతర మతస్తుల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుమలలో మూడురోజుల పాటు సాగిన ధార్మిక సదస్సులో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, పీఠాధిపతులు, మఠాధిపతుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. సనాతన ధర్మం విశ్వవ్యాప్తం చేయాలని టీటీడీకి పలువురు పీఠాధిపతులు సూచించారు. హైందవ మత మార్పిడిలను అరికట్టే విధంగా ఈ సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. హైందవ ధర్మంలోకి రావాలనుకునే అన్యమతస్థులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
పీఠాధిపతులు, మఠాధిపతులు ఇచ్చిన సలహాతోనే స్వచ్చందంగా హిందూమతంలోకి రావాలనుకునేవారికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. ఈ సదస్సుకు వచ్చిన పలువురు స్వామీజీల నుంచిఏకాభిప్రాయం లభించింది. హిందూమతంలోకి రావాలనుకునేవారి కోసం ఏర్పాట్లు చేయనన్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలు కలిసే పవిత్రల ప్రోక్షణంచేసి శాస్త్రాలనుసారం హైందవంలోకి ఆహ్వానిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌లను అభినందించిన ప్రధాని మోదీ..దేశం గర్విస్తోందంటూ.!