Tammineni: ఎమ్మెల్యే ఆళ్ల రాజీనామాపై స్పీకర్ తమ్మినేని రియాక్షన్.!

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై స్పీకర్ తమ్మినేని స్పందించారు. ఆర్కే ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలియదని చెప్పారు. రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని చెప్పారు.

New Update
AP Politics: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ

Speaker Tammineni: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీలో కలవరం మొదలైంది. వైసీపీ అసంతృప్తి నేతలు ఒకొక్కరుగా వెలుగులోకి వస్తూ..పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం కలకలం రేపింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఓఎస్డీకి తన రాజీనామా లేఖను ఆర్కే స్వయంగా అందజేశారు.

Also Read: తమిళనాడు ఆలయంలో ఏపీ భక్తులపై దాడి.. వీడియో ఇదిగో..!

రాజీనామాపై తమ్మినేని స్పందిస్తూ.. ఆర్కేతో స్వయంగా మాట్లాడి రాజీనామా ఎందుకు చేశారో తెలుసుకుంటానని ఆయన తెలిపారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలియదని చెప్పారు. రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని చెప్పారు. మరోవైపు, రాజీనామా చేసిన అనంతరం ఆర్కే ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. తన ఫోన్ ను ఆయన స్విచ్చాఫ్ చేసుకున్నారని చెపుతున్నారు. ఇంకోవైపు, మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీగా గంజి చిరంజీవిని జగన్ నియమించారు.

Also Read: చేయని తప్పుకు పోలీసులు కొట్టారనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య.!

మంగళగిరి, గాజువాక వైసిపి ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేసారో అర్ధం కావడం లేదన్నారు. రాజీనామా చేసిన ఇద్దరూ నేతలు ముఖ్యమంత్రి తో నేరుగా మాట్లాడే వ్యక్తులేనని అన్నారు. వారి మద్య ఎటువంటి మద్యవర్తిత్వం అవసరం లేదని తెలిపారు.ఆ రాజీనామాలు ఆమోదానికి నోచుకోవని, సమస్య సద్దుమణిగే అవకాశం వుందని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు