Ayyanna: మనకు ఇదే మఖ్యం.. అవసరమైతే హౌస్ ని ఇలా కూడా చేస్తా.. స్పీకర్ అయ్యన్న..!

తనను ఏకగ్రీవంగా శాసనసభ స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు అయ్యన్నపాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలోని ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇస్తానని.. ముఖ్యంగా సమస్యలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. అవసరమైతే హౌస్‌ని రెండు మూడు రోజులు పొడిగిస్తానని స్పష్టం చేశారు.

Ayyanna: మనకు ఇదే మఖ్యం.. అవసరమైతే హౌస్ ని ఇలా కూడా చేస్తా.. స్పీకర్ అయ్యన్న..!
New Update

Speaker Ayyanna Patrudu: ఏకగ్రీవంగా తనను శాసన సభ స్పీకర్ గా ఎన్నుకొన్నందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు అయ్యన్నపాత్రుడు. ఇద్దరు మహిళలు.. 33 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయనవాళ్లు, 39 మంది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ సభలో ఉన్నారని వెల్లడించారు.

Also Read: అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. నవ్వులే నవ్వులు

ప్రజలు అధికారం ఇచ్చి బాధ్యత పెంచారన్నారు. మొదటి సారి ఎమ్మెల్యేలుగా వచ్చిన వారు 87 మంది ఉన్నారని.. అందరికి మాట్లాడే అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. సమస్యలపై చర్చ జరగాలి.. అవసరం అయితే హౌస్ ని (AP Assembly) రెండు మూడు రోజులు పొడిగిస్తానని స్పష్టం చేశారు. 9 మంది కొత్తవారికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారన్నారు.

Also read: అయ్యన్న పాత్రుడి స్ఫూర్తితోనే ఎదిగాను.. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో..

రాజకీయ జీవితంలో గెలుపోటములు రెండు చూసానని..టీడీపీ (TDP) జెండా పట్టుకొని చనిపోవాలి అని ఉందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ఎలా ప్రజెంట్ చేయాలో తెలుసుకోవాలి..ప్రశ్న ఎలా వేయాలో, ఎలా సమాధానం చెప్పాలో తెలుసుకోవాలన్నారు.. అవసరం అయితే ట్రైనింగ్ ఇస్తామన్నారు. కొన్ని లక్షల మంది మనల్ని చూస్తున్నారని.. స్పీకర్ తక్కువగా మాట్లాడాలి.. సభ్యులు ఎక్కువగా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు.

#ayyanna-patrudu #ap-assembly-sessions-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe