Spanish Woman Case: స్పెయిన్ మహిళపై గ్యాంగ్ రేప్ కేసును సుమోటోగా స్వీకరించిన జార్ఖండ్‌ హైకోర్టు!

జార్ఖండ్‌-దుమ్కా స్పెయిన్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దుమ్కా ఎస్పీ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.

Spanish Woman Case: స్పెయిన్ మహిళపై గ్యాంగ్ రేప్ కేసును సుమోటోగా స్వీకరించిన జార్ఖండ్‌ హైకోర్టు!
New Update

Jharkhand Court News: జార్ఖండ్ లోని దుమ్కా సమీపంలో భర్తతో కలిసి మోటారు సైకిల్ యాత్రకు వెళ్లిన 45 ఏళ్ల స్పెయిన్ పర్యాటకురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనను జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పరిస్థితి తీవ్రతను ఎత్తిచూపుతూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నేరాలు దేశ ప్రతిష్ఠ, పర్యాటక ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావాలను చూపుతాయని ఉంటాయని కోర్టు నొక్కి చెప్పింది. జస్టిస్ నవనీత్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. 'విదేశీయులపై ఏ విధమైన నేరాలు జరిగినా దేశ పర్యాటక ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు తీవ్రమైన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను కలిగిస్తాయి. విదేశీ మహిళపై లైంగిక సంబంధిత నేరం దేశానికి వ్యతిరేకంగా ప్రతికూల ప్రచారాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉంది..' అని బెంచ్ వ్యాఖ్యానించింది.

సమాధానం చెప్పాల్సిందే:
ఈ కేసు విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దుమ్కా ఎస్పీ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఘటనపై నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. అదే రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దుమ్కా ఎస్పీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అంతకుముందు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ.10 పరిహారం చెక్కును అందజేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, డీసీ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ స్పానిష్ జర్నలిస్ట్ కూడా పాల్గొన్నారు.

దంపతుల కంప్లైంట్:
తాను, తన భర్త బంగ్లాదేశ్ మీదుగా జార్ఖండ్ లోని దుమ్కా చేరుకున్నామని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాత్రివేళ భర్తతో కలిసి పొలంలో గుడారం వేసి విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో భార్యాభర్తలిద్దరూ గుడారంలో ఉండగా బయటి నుంచి శబ్దం వినిపించింది. ఇద్దరు వ్యక్తులు ఫోన్ లో మాట్లాడుకోవడం చూశామని.. అది మామూలే అనుకున్నామన్నారు. కానీ తర్వాత ఎక్కువ మంది వచ్చారని తెలిపారు. అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరికో కాల్ చేశారు. అప్పుడు రెండు బైక్ లపై ఐదుగురు వ్యక్తులు వచ్చారని బాధిత మహిళ తెలిపింది.

దోచుకున్నారు:
అందరూ గుడారంలోకి ప్రవేశించారని.. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు నా భర్తను పట్టుకుని చేతులు కట్టేసి చితకబాదారని చెప్పింది. నలుగురు వ్యక్తులు తనను గుడారం నుంచి బయటకు తీసుకువచ్చారని.. ముందుగా దాడి చేసినట్టు తెలిపింది. ఆ తర్వాత వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారని వాపోయింది. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని, నిందితులంతా మద్యం మత్తులో ఉన్నారని చెప్పింది. ఇక అంతటితో ఆగకుండా డబ్బులను కూడా దోచుకున్నారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు మహిళ. డైమండ్ రింగ్, పర్సు, బ్లూటూత్ డివైజ్, స్పానిష్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, బంగ్లాదేశీ నాణేలు, 11,000 భారతీయ రూపాయలు, 300 అమెరికా డాలర్లు దోచుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Also Read: స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో భర్త ఆవేదన!

#jharkhand #spanish-woman
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe