soccer kiss scandal : మహిళా ప్లేయర్‌కు ముద్దు పెట్టాడు.. పదవి పోయింది.. అసలేం జరిగింది?

గత ఆగస్టు 20న సిడ్నీలో జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో స్పెయిన్ 1-0తో ఇంగ్లండ్‌పై గెలుపొందిన తర్వాత అవార్డుల ప్రదానోత్సవంలో జెన్నీ హెర్మోసో పెదవులపై ముద్దుపెట్టుకున్న రూబియాల్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తన సమ్మతి లేకుండా ముద్దు పెట్టుకున్నట్లు హెర్మోసో తెలిపారు. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి విమర్శలు వచ్చాయి. యనపై సస్పెన్షన్‌ వేటు వేసింది ఫిఫా. అటు తన పదవికి రాజీనామా చేశారు లూయిస్‌.

New Update
soccer kiss scandal : మహిళా ప్లేయర్‌కు ముద్దు పెట్టాడు.. పదవి పోయింది.. అసలేం జరిగింది?

Spain soccer chief Luis Rubiales kiss scandal: స్పెయిన్ సాకర్ చీఫ్ లూయిస్ రూబియల్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆయన అత్యుత్సాహం పదవికే ఎసరు తెచ్చింది. తమ దేశం తొలిసారిగా ఫిఫా మహిళల వరల్డ్‌ కప్‌ టైటిల్‌ గెలిచిందన్న ఆనందంలో మహిళా ప్లేయర్‌కు ముద్దివ్వడంపై పెద్ద దుమారం చెలరేగింది. దీంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది ఫిఫా. చివరకు తన పదవికి రాజీనామా చేశారు లూయిస్‌.

ఏం జరిగింది?
గత నెలలో సిడ్నీలో జరిగిన ఫైనల్‌లో 1-0తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించిన స్పెయిన్‌..తొలిసారిగా ఫిఫా మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకుంది. టీమ్‌ సభ్యులకు మెడల్స్‌ అందిస్తూ స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్‌ క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు. స్టార్‌ ప్లేయర్‌ జెన్నిఫర్‌ హెర్మోసోతో పాటు మిగిలిన క్రీడాకారులను ముద్దు పెట్టుకున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గెలుపు కన్నా ఈ ముద్దు వివాదమే ఎక్కువగా వార్తల్లో నిలవడంతో తొలిసారి చాంఫియన్‌గా నిలిచామన్న ఆనందం స్పెయిన్ మహిళా జట్టుకు లేకుండా పోయింది.

బాధ్యతల నుంచి తొలగింపు:
మరోవైపు రుబియాల్స్‌పై హైకోర్టులో లైంగిక వేధింపుల పిటిషన్‌ వేశారు హెర్మోసో. ఈ నేపథ్యంలో అటు సస్పెన్షన్‌ వేటు..ఇటు కేసులతో తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2018లో ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు లూయిస్‌. ఈ పదవితో పాటు యూనియన్‌ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్‌ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి కూడా వైదొలిగారు. రుబియాల్స్‌ను ఫుట్‌బాల్ కార్యకలాపాల నుంచి మూడు నెలల పాటు FIFA సస్పెండ్ చేసింది. అతని చర్యలపై సాకర్ ప్రపంచ పాలకమండలి విచారణ జరుపుతుంది. 'ఫిఫా చేపట్టిన వేగవంతమైన సస్పెన్షన్, దానితో పాటు మిగిలిన విచారణలు తన స్థానానికి ఇక తిరిగి రాలేనని స్పష్టమైంది' అని రూబియాల్స్ ఒక ప్రకటనలో తెలిపారు. యూరోపియన్ సాకర్ బాడీ UEFA వైస్ ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేశానని చెప్పాడు. ఆదివారం జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుబియల్స్ కుటుంబం, స్నేహితులతో మాట్లాడిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఆమోదించిన లైంగిక సమ్మతి చట్టం ప్రకారం, రుబియాల్స్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే జరిమానా లేదా ఏడాది నుంచి నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్షను అనుభవించవచ్చు.

ALSO READ: చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ బోర్డ్….క్యాసినోవాకు వెళ్ళారని ఆరోపణలు

Advertisment
Advertisment
తాజా కథనాలు