Sovereign Gold Bonds 2024: బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం మళ్ళీ వస్తోంది. అవును. బంగారం కొని దాచుకుంటే.. తరువాత ఎక్కువ ధర వచ్చినపుడు దానిని అమ్ముకుంటే లాభం వస్తుంది కదా అని మీరు భావిస్తుంటే మీకోసం మంచి ఆప్షన్ ఉంది. బంగారాన్ని భౌతికంగా కొని దాచుకోవడం చాలా సమస్యలు తెస్తుంది. ఇప్పుడు డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉంది. ప్రభుత్వం కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారికోసం సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో సావరిన్ గోల్డ్ బాండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇప్పుడు
సావరిన్ గోల్డ్ బాండ్(Sovereign Gold Bonds 2024)లో పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం మరోసారి మీకు అవకాశం కల్పిస్తోంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 కింద, ఫిబ్రవరి 12 నుండి 16 వరకు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే, గోల్డ్ బాండ్లను ఏ రేటుకు జారీ చేస్తారనే సమాచారం ఇంకా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి? వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎలా వీటిని మళ్ళీ రీడీమ్ చేసుకోవచ్చు వంటి సమగ్ర సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి?
సావరిన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bonds 2024)అనేది ప్రభుత్వ బాండ్. దీన్ని డీమ్యాట్‌గా మార్చుకోవచ్చు. ఈ బాండ్ 1 గ్రాము బంగారం, అంటే బాండ్ ధర 1 గ్రాము బంగారం ధరతో సమానంగా ఉంటుంది. ఇది ఆర్‌బిఐ జారీ చేస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం అలాగే, డిజిటల్ పేమెంట్ చేస్తే కనుక, గ్రాముకు 50 రూపాయల తగ్గింపు లభిస్తుంది.
స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి. .
సావరిన్ గోల్డ్ బాండ్(Sovereign Gold Bonds 2024)లో, మీరు 24 క్యారెట్ల అంటే 99.9% స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. SGBలలో పెట్టుబడులు 2.50% వార్షిక వడ్డీని పొందుతాయి. డబ్బు అవసరమైతే, బాండ్‌పై రుణం కూడా తీసుకోవచ్చు.
ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ అంటే IBJA ప్రచురించిన రేటు ఆధారంగా బాండ్ ధర నిర్ణయిస్తారు. ఇందులో, సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి మూడు రోజుల రేట్ల ఏవరేజ్ లెక్కించి ఆ ధరను నిర్ణయిస్తారు. .
ప్యూరిటీ-సేఫ్టీ కి నో టెన్షన్..
Sovereign Gold Bonds 2024లలో స్వచ్ఛత గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రకారం, ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రచురించిన 24 క్యారెట్ల స్వచ్ఛత బంగారం ధరతో బంగారు బాండ్ల ధర ముడిపడి ఉంది. దీనితో పాటు, దీనిని డీమ్యాట్ రూపంలో ఉంచవచ్చు. ఇది చాలా సురక్షితమైనది. అలాగే, దానిపై ఎటువంటి ఖర్చు ఉండదు.
4 కిలోల బంగారం వరకూ
SGBల ద్వారా, ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము - గరిష్టంగా 4 కిలోల బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ హోల్డింగ్ విషయంలో, 4 కిలోల పెట్టుబడి పరిమితి మొదటి దరఖాస్తుదారుపై మాత్రమే వర్తిస్తుంది. అయితే ఏదైనా ట్రస్ట్ కొనుగోలు గరిష్ట పరిమితి 20 కిలోలుగా ఉంటుంది.
Also Read: ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు నాలుగేళ్లలో డబుల్ గ్యారెంటీ!
టాక్స్ ఎలా ఉంటుందంటే..
సావరిన్ మెచ్యూరిటీ వ్యవధి 8 సంవత్సరాలు. మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత, దాని నుండి వచ్చే లాభాలపై పన్ను ఉండదు. అయితే మీరు మీ డబ్బును 5 సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకుంటే, దాని నుండి వచ్చే లాభం పై దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) రూపంలో 20.80% పన్ను విధిస్తారు.
ఆఫ్‌లైన్‌లో కూడా పెట్టుబడి..
దీనిలో పెట్టుబడి పెట్టడానికి RBI అనేక ఆప్షన్స్ ఇచ్చింది. బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL) ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. పెట్టుబడిదారు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. దీని తర్వాత, మీ బ్యాంక్ ఎకౌంట్ నుండి డబ్బు డెబిట్ అవుతుంది. మీ బాండ్స్ మీ డీమ్యాట్ ఎకౌంట్ కు బదిలీ అవుతాయి.
Sovereign Gold Bonds 2024పెట్టుబడి పెట్టాలంటే పాన్ తప్పనిసరి. ఈ బాండ్లను అన్ని బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (BSE) ద్వారా మీరు కొనుగోలు చేయవచ్చు.
అదీ విషయం.. సావరిన్ గోల్డ్ బాండ్స్ (Sovereign Gold Bonds 2024)బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి ఆప్షన్. బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎనిమిదేళ్ల తరువాత మంచి రిటర్న్స్ అందుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా పెట్టుబడి పెట్టేముందు మీ ఆర్థిక సలహాదారుని సూచనలు కూడా తీసుకోవడం మంచిది.
Watch this Interesting Video: