దేశంలో రైల్వే జాబ్స్‌కి విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. సౌత్ వెస్ట్రన్ రైల్వే 904 అప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు RRC హుబ్లీ అధికారిక సైట్ http://rrchubli.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 3న ప్రారంభం అవ్వగా.. ఆగస్టు 2న ముగియనుంది. అంటే మరో 4రోజుల్లోనే ఈ పోస్టుల గడువు ఎండ్ కానుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 904 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.
ఖాళీ వివరాలు:
➡ హుబ్లీ డివిజన్: 237 పోస్టులు
➡ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ: 217 పోస్టులు
➡ బెంగళూరు డివిజన్: 230 పోస్టులు
➡ మైసూరు డివిజన్: 177 పోస్టులు
➡ సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు: 43 పోస్టులు
అర్హత :
అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) కనీసం 50శాతం మార్కులతో, మొత్తంగా.. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వయస్సు పరిమితి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
అప్రెంటిస్‌షిప్ కోసం ITI మార్కులతో పాటు మెట్రిక్యులేషన్‌లో మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు రుసుము రూ.100. డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. SC/ST/మహిళలు/PwBD అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు RRC హుబ్లీ అధికారిక సైట్‌ని చెక్ చేయవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి:
స్టెప్ 1: RRC హుబ్లీ అధికారిక వెబ్‌సైట్ http://rrchubli.in కి వెళ్లండి .
స్టెప్ 2: హోమ్‌పేజీలో 'రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ వివరాలను నమోదు చేసుకోండి.
స్టెప్ 4: వ్యక్తిగత, విద్యాపరమైన, ఇతర వివరాలను కలిగి ఉన్న దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
స్టెప్ 5: అవసరమైన పత్రాలను(documents) అప్‌లోడ్ చేయండి, దరఖాస్తు రుసుము చెల్లించండి.
స్టెప్ 6: ఫారమ్‌ను సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా చెక్ చేయండి.
స్టెప్ 7: సంబంధిత కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
RRC RECRUITMENT:
మరోవైపు భారతీయ రైల్వే RRC టెక్నీషియన్లు, JE, అసిస్టెంట్ లోకోపైలట్ రైలు మేనేజర్ పోస్టుల కోసం 677 ఖాళీలను భర్తీ చేయనుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ అప్లికేషన్ ఈ నెల 30న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 30.
మొత్తం ఖాళీలు: 677
సాంకేతిక నిపుణులు- 87
జేఈ- 117
అసిస్టెంట్ పైలట్- 390
రైలు మేనేజర్- 83