South Indian Dishes: బియ్యం పిండితో చేసే.. పాపులర్ సౌత్ ఇండియన్ డిషేస్

బియ్యంతో చాలా రకాల వంటకాలు చేస్తారు. వాటిలో కొన్ని పాపులర్ సౌత్ ఇండియన్ డిషెస్ గా పేరు పొందాయి. దోష, ఇడియప్పం, అప్పం, మురుకు, పుట్టు, నీర్ దోష, కోజుకట్టై వంటకాలు ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

New Update
South Indian Dishes: బియ్యం పిండితో చేసే.. పాపులర్ సౌత్ ఇండియన్ డిషేస్

South Indian Dishes:  బియ్యం పిండి, బియ్యాన్ని ఎన్నో రకాల పిండి వంటలు, స్నాక్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు బియ్యంతో తయారు చేసే కొన్ని పాపులర్ సౌత్ ఇండియన్ రేసిపీస్ గురించి తెలుసుకుందాం..

పాపులర్ సౌత్ ఇండియన్ డిషెస్

దోష

పాపులర్ సౌత్ ఇండియన్ డిషెస్ లో దోష ఒకటి. దీన్ని పులియబెట్టిన బియ్యం పిండి, మినపప్పు కలయికతో తయారు చేస్తారు. ఈ క్రిస్పీ, దోషను గ్రీన్ లేదా పల్లీ చట్నీ లో పెట్టుకొని తింటారు.

ఇడియప్పం

ఈ వంటకాన్ని స్ట్రింగ్ హోపర్స్ అని కూడా అంటారు. ఇది సౌత్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ పాపులర్ డిష్. బియ్యం పిండితో తయారు చేసే ఈ డిష్ నూడిల్స్ ఆకారంలో ఉంటుంది. దీన్ని స్టీమింగ్ పద్దతిలో కుక్ చేస్తారు. ఇడియప్పం.. కోకోనట్ మిల్క్ లేదా కర్రీతో తింటారు.

పుట్టు

ఇది కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్. దీని రైస్ ఫ్లోర్, కొబ్బరి తురుముతో చేస్తారు. ఈ వంటకాన్ని స్టీమింగ్ పద్దతిలో మెటల్ ట్యుబ్స్ లేదా బంబో స్టిక్స్ ఉపయోగించు వండుతారు. పుట్టును బనానా, షుగర్ లేదా బటాని కర్రీ తో తింటారు.

నీర్ దోష

ఇది కూడా ఒక రకమైన దోష. దీన్ని కర్ణాటకలో ఎక్కువగా తింటారు. ఇది పలుచగా, మెత్తగా, పొరలు పొరలుగా ఉంటుంది. నీర్ దోష విత్ కోకనట్ చట్నీ లేదా కర్రీ తో తింటారు.

కోజుకట్టై

కొన్ని ప్రదేశాల్లో వీటిని మొదక్ అంటారు. స్వీట్ స్టఫింగ్ తో కూడిన వీటిని రైస్ ఫ్లోర్, కోకోనట్ తురుము, బెల్లంతో తయారు చేస్తారు. ఈ వంటకాన్ని చేయడానికి స్టీమింగ్ ప్రాసెస్ ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

Also Read: Operation Valentine Trailer: “ఏం జరిగిన చూస్కుందాం” .. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్

Advertisment