నిరుద్యోగులకు గుడ్‎న్యూస్..దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!

భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు SCR అధికారిక వెబ్‌సైట్ అంటే దక్షిణ మధ్య రైల్వే scr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం 30 జూన్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

author-image
By Bhoomi
నిరుద్యోగులకు గుడ్‎న్యూస్..దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!
New Update

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టెక్నికల్ అసోసియేట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 35. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 చివరి తేదిగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Railway Recruitment 2023

ఖాళీల వివరాలు :
రైల్వే బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 35 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను రిక్రూట్ చేస్తారు. వీటిలో
సివిల్ ఇంజినీరింగ్ - 19 పోస్టులు
ఎలక్ట్రికల్ (డ్రాయింగ్) - 10 పోస్టులు
ఎస్ & టి (డ్రాయింగ్) - 6 పోస్టులు

దరఖాస్తు రుసుము:
SC/ST/OBC/మహిళలు/మైనారిటీ/EWS కేటగిరీ అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తు రుసుముగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇతర అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 500/-. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవచ్చు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe