/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Special-Trains-jpg.webp)
తెలంగాణ, ఏపీ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరో శుభవార్త చెప్పింది. ఈ రాష్ట్రాల్లో సేవలు అందించే మొత్తం 4 ట్రైన్ల గమ్య స్థానాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం నాలుగు ట్రైన్లలో ఒకటి ప్యాసింజర్ ట్రైన్ కాగా.. మరో 3 ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఈ రైళ్ల సేవలను రేపు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. గమ్యస్థానం పొడిగింపబడిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త
- జైపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (Train No.919713/19714) ను ప్రస్తుతం జైపూర్-కాచిగూడ మధ్య నడుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. దీంతో కర్నూలుతో పాటు గద్వాల, మహబూబ్‌నగర్, షాద్‌నగర్ ప్రజలుకు ప్రయోజనం చేకూరనుంది.
ఇది కూడా చదవండి: MMTS: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లు.. ఏ రూట్లలో అంటే?
- ఇప్పటి వరకు హడప్సర్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (17013/17014) ఇప్పటి వరకు హడప్సర్ (పూణె)- హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించేది. ప్రస్తుతం ఈ ట్రైన్ ను భువనగిరి, జనగామ మీదుగా కాజీపేట వరకు పొడిగించారు.
Shri G. Kishan Reddy, Hon’ble Union Minister to Flag off Extension of Four Train Services in Telangana Region @kishanreddybjp @RailMinIndia pic.twitter.com/i2pTyptWNO
— South Central Railway (@SCRailwayIndia) October 8, 2023
- పర్భణీ డైలీ ఎక్స్‌ప్రెస్ (17664/17663)- ఈ ట్రైన్ ఇప్పటివరకు హెచ్‌ఎస్ నాందేడ్ - తాండూరు మధ్య రాకపోలకు సాగించేది. తాజాగా ఈ ట్రైన్ ను సేడం, యాద్గిర్ మీదుగా రాయచూరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే.
Existing Tr No. 17014 / 17013 Pune (Hadapsar)-Hyderabad–Pune (Hadapsar) Tri-weekly Exp extended up to Kazipet (w.e.f) 9th October, 2023
-Change in Terminal: Tr No. 17014/17013 Tri-weekly Exp will now run btw Pune (Hadapsar)– Kazipet via.,Secunderabad instead of Hyderabad Stn pic.twitter.com/UVsTUKfFZr
— South Central Railway (@SCRailwayIndia) October 8, 2023
- కరీంనగర్ డైలీ ప్యాసింజర్ (07894/07893): కరీంనగర్ - నిజామాబాద్ మధ్య నడిచే ఈ ట్రైన్ ను తాజాగా బోధన్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే.