Extension of Special Trains: మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు(Summer Holidays) రానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల దృష్ట్యా ఇప్పటికే రైలు టికెట్లన్ని రెండు నెలల ముందే ఫుల్ అయిపోయాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఊర్లకు వెళ్లేవారికి టికెట్లు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెండు నెలల పాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఎనిమిది రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. కాచిగూడ – మధురై ప్రత్యేక రైలును ఏప్రిల్ 8 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
మధురై-కాచిగూడ రైలును ఏప్రిల్ 10 నుంచి జూన్ 26 వరకు పొడిగించింనట్లు పేర్కొన్నారు.కాచిగూడ -నాగర్‌కోయిల్ రైలు ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి బుధవారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారుల తెలిపారు. నాగర్‌కోయిల్ -కాచిగూడ రైలు ఏప్రిల్ 7 నుంచి జూన్ 28 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉండనుంది. హెచ్‌ఎస్ నాందేడ్ – ఈరోడ్ రైలు ఏప్రిల్ 8 నుంచి జూన్ 28 వరకు, ఈ రోడ్ – నాందేడ్ రైలు ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
జాల్నా – చాప్రా రైలు జూన్ 26 వరకు, చాప్రా – జాల్నా ప్రత్యేక రైలు ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
Also Read: మీరు యూరిక్ యాసిడ్ తో బాధపడుతుంటే రాత్రి పూట ఆహారంలో ఇవి చేర్చుకోండి!