Cheetah Gamini: మధ్యప్రదేశ్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్‌లో సౌతాఫ్రికా నుంచి తీసుకొచ్చిన గామిని అనే చిరత గత వారం రోజుల క్రితం 5 పిల్లలకు జన్మనిచ్చినట్లు వార్తలు వినిపించాయి. దీంతో దేశంలో మొత్తం పెద్ద పులుల సంఖ్య 26కి చేరుకుందని అధికారులు తెలిపారు. అయితే, దీనిపై తాజాగా, మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరత గామిని 5 కాదు 6 పిల్లలకు జన్మనిచ్చిందని.. ప్రస్తుతం దేశంలో ఉన్న పులుల సంఖ్య 27కు చేరుకుందని తెలుస్తోంది.
Also Read: అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్.. ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్!
వారం తర్వాత అధికారులు అక్కడికి వెళ్లి చూడాగా.. మొత్తం ఆరు పులి పిల్లలు ఉన్నట్లు తెలిపారు. దీంతో చిరత గామిని 5 కాదు 6 పిల్లలకు జన్మనిచ్చిందని అధికారులు ధ్రువీకరించారు. కాగా, చరిత్రలో ఒక ఆడ చిరుత ఆరు పిల్లలకు జన్మనివ్వడం ఇదే తొలిసారి అని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు.
Also Read: 50 సెకన్ల యాడ్ కోసం రూ. 5 కోట్లు వసూలు చేసిన లేడీ సూపర్ స్టార్!